మరణించిన తల్లి ఋణం ఇలా తీర్చుకున్న నలుగురు కూతుళ్లు!

4 daughters dismantle rood for mothers funeral

12:28 PM ON 26th September, 2016 By Mirchi Vilas

4 daughters dismantle rood for mothers funeral

ఈమధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మానవత్వం మంట కలిసిందా అన్నట్టు కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. తాజాగా ఒడిశాలోని కలహంది జిల్లాలో ఇదో హృదయవిదారక ఉదంతం. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఘటనలో 75 ఏళ్ళ తమ కన్నతల్లి కనక్ సత్పతి అనారోగ్యంతో కన్ను మూస్తే, ఆమె నలుగురు కూతుళ్ళు ఏం చేశారో తెలిస్తే మానవతావాదులు చాలించాల్సిందే. వివరాల్లోకి వెళ్తే.. కలహంది జిల్లా డోక్రిపాడ గ్రామంలోని అతిపేద కుటుంబమది. తాను ఎక్కడో కష్టపడి పని చేస్తూ తన నలుగురు కూతుళ్ళను పెంచి పెద్ద చేసింది కనక్ సత్పతి. అయితే.. వృద్ధాప్యం వల్ల ఇక పని చేయలేక తీవ్ర అనారోగ్యానికి గురై ఈ నెల 23న మరణించింది. తమ తల్లి మరణాన్ని తట్టుకోలేని ఆమె కుమార్తెలు కనీసం ఆమె అంత్యక్రియలనైనా జరిపించాలనుకున్నారు.

ఇందుకు తమకు సాయం చేయవలసిందిగా తమ బంధువులు, ఇరుగుపొరుగు వారిని కోరారు. కానీ, ఎవరూ ముందుకు రాకపోవడంతో చేసేదిలేక తామే తల్లి మృతదేహాన్ని ఓ చెక్క మంచంపై పెట్టి భుజాన మోసుకుంటూ శ్మశానవాటికకు తీసుకుపోయారు. ఇక అలా తీసుకెళ్ళాక అక్కడ కూడా ఓ సమస్య ఎదురైంది. కనక్ సత్పతి అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు వారికి దొరకలేదు. దాంతో తిరిగి వచ్చి తమ ఇంటి పైకప్పు పగులగొట్టి ఆ కట్టెలతో దహనక్రియలు కానిచ్చారు. ఈ నలుగురు కూతుళ్ళలో ఇద్దరు వితంతువులు కాగా, మరో ఇద్దరిని వారి భర్తలు వదిలేసి వెళ్ళిపోయారు. చేతిలో చిల్లిగవ్వయినా లేని వీరికి భిక్షాటనే శరణ్యమైంది. ఈ దేశంలో పేదరికం ఇంత దారుణంగా ఉందని అనేకమంది వాపోతున్నారు.

సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కడతేరిన కన్నతల్లి మృత దేహాన్ని కాల్చడానికి కట్టెల్లేవు.. కట్టుకున్న ఇంటి కప్పును పగులగొట్టి ఆ కట్టెలతో తమ తల్లి అంత్యక్రియలు కూడా జరిపించుకోలేని అభాగ్యుల్ని చూసి జాలి పడదామా.. మన వ్యవస్థల అస్తవ్యస్త విధానాన్ని చూసి ఆగ్రహిద్దామా అంటున్నారు నెటిజన్లు. ఆమధ్య మరణించిన తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్ల దూరం నడిచిన ఓ పేద భర్త ఉదంతం మరవకముందే ఇదో దారుణ ఘటన!

ఇది కూడా చదవండి: స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా బ్లూఫిలింస్ చూస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యల్లో ఇరుక్కున్నట్టే!

ఇది కూడా చదవండి: వ్యభిచారం చేస్తున్న స్టార్ హీరోయిన్ సిస్టర్.. రోజుకి 5లక్షలు.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: అబార్షన్ తరువాత మంచి ఆరోగ్యం కోసం ఇవి తినండి..

English summary

4 daughters dismantle rood for mothers funeral. A mother died due to health problem. Her 4 daughters did the funeral and shows her great heart.