వరుసగా నాలుగు రోజులు బ్యాంక్ లు శెలవు

4 days holidays for Banks in India

01:20 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

4 days holidays for Banks in India

భారతదేశంలో ఉండే ప్రజలు మొత్తం ఇబ్బంది పడాల్సిన సమయం వచ్చింది. అదేంటంటే వరుసగా నాలుగు రోజులు శెలవు లు రావడంతో నాలుగు రోజులు బ్యాంక్ లు మూసి వేయబడనున్నాయి. ఇప్పుడు కాలంలో దొంగ లకి భయపడి ఇంట్లో డబ్బులు, నగలు ఉంచడం మానేశారు. అవసరమైనప్పుడు రోడ్డు పక్కనుండే ఏటీఎం నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ప్రయాణాలు చేస్తే ఇది వరకు డబ్బులు ఎంతో జాగ్రత్తగా దాచుకుని పట్టికెళ్లేవారు. అయితే ఇప్పుడు బ్యాంక్ లు, ఏటీఎమ్ లు రావడంతో పర్స్ లో డబ్బులు పెట్టడం మానేసి ఏటీఎమ్ కార్డులు పెడుతున్నారు. తమకి అవసరమైనప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. తాము సంపాదించిన డబ్బు మొత్తం బ్యాంక్ ల్లోనే వేసేస్తున్నారు.

ఇంట్లో ఏ మాత్రం డబ్బుని, నగదుని, స్థలాలు-పొలాలు-ఇల్లు కి సంబంధించిన కాగితాలుని కూడా బ్యాంక్ ల్లోనే లాకర్స్ లో పెట్టేస్తున్నారు. అయితే ఈ నెల గురువారం మొదలు ఆదివారం వరకూ బ్యాంకులు పని చేయని పరిస్థితి. అప్పుడప్పుడు శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు శెలవు లు మామూలే అయినా, ఇలా నాలుగు రోజులు వరుసగా శెలవు లు రావడం మాత్రం అరుదు. అంటే ఇంకా రెండు రోజుల తర్వాత నుంచి వరుసగా నాలుగు రోజుల వరకూ బ్యాంకులు బంద్ కానున్న నేపథ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. బ్యాంకు లాకర్ లో ఏదైనా విలువైన డాక్యుమెంట్లు దాచి పెట్టి, ఆ నాలుగు రోజుల్లో వాటితో పని పడితే ఇంక అంతే సంగతులు.

ఇంకా దొంగల భయంతో బ్యాంకు లాకర్లో బంగారు నగలు దాచి ఉంచేవారు కి కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి నాలుగు రోజుల్లో ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ తగిలితే కాస్త కష్టమే. ఇంకా ఎక్కువ డబ్బులతో పనిపడే వాళ్ళు కూడా బుధవారం నాటికి డ్రా చేసేయటం మంచిది. మొత్తానికి బ్యాంక్ కి సంబంధించి ఏ పని ఉన్న బుధవారం నాటికి చక్కబెట్టేయడం మంచిది. ఎందుకంటే గురువారం హోలీ, శుక్రవారం గుడ్ ఫ్రైడే, శనివారం(వార్షిక చివరి శనివారం కావటంతో శెలవు), ఇకపోతే ఆదివారం షరామామూలే. అయితే ఏటీఎం కష్టాలు లేకుండా చూసేందుకు ప్రత్యేకంగా మనీ ఫిల్లింగ్ చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్తున్నా, అందరూ ముందు జాగ్రత్తగా అన్ని చక్కబెట్టుకుంటే ఇబ్బందులు నుండి బయట పడొచ్చు.

English summary

4 days holidays for Banks in India. The holidays is from thursday onwards, because thursday is Holi, Friday is Good Friday and remaining list you can see in this article.