కొత్త సంవత్సరంలో 4 గ్రహణాలు

4 Eclipse in this New Year

11:08 AM ON 31st December, 2016 By Mirchi Vilas

4 Eclipse in this New Year

ఇంచుమించు ప్రతియేటా సూర్య గ్రహణం గానీ, చంద్రగ్రహణం గానీ చూస్తుంటాం. ఒక్కో ఏడాది రెండు గ్రహణాలు వస్తుంటాయి. కానీ కొత్త సంవత్సరం(2017)లో నాలుగు గ్రహణాలు ఆకాశంలో కనువిందు చేయబోతున్నాయట. ఈమేరకు ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు ఈ గ్రహణాలను చూసి ఆనందించవచ్చని తెలిపారు. వీటిలో రెండు చంద్ర గ్రహణాలు కాగా మిగతా రెండు సూర్య గ్రహణాలని ఉజ్జయినిలోని జివాజీ పరిశోధనా సంస్థ పేర్కొంది. అయితే, ఇందులో రెండు గ్రహణాలు మాత్రమే భారతలో కనిపిస్తాయని వివరించింది. 2017 ఫిబ్రవరి 11న ఏర్పడే చంద్రగ్రహణాన్ని భారతీయులు చూడొచ్చని అయితే, అదే నెల 26న ఏర్పడే సూర్యగ్రహణాన్ని చూడలేమని జివాజీ ఇనిస్టిట్యూట్‌ సూపరింటిండెంట్‌ తెలిపారు. ఆపై ఆగస్టు 7న ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం భారతలో కనిపిస్తుందని వివరించారు. ఆగస్టు 21న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారతలో కనిపించదని వివరించారు.

ఇది కూడా చూడండి : ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి : మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కల్గించే వస్తువులు ఇవే ... వెంటనే తీసేయండి..!

ఇది కూడా చూడండి : అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

Generally we can see 1 or 2 Eclipse every year but there are 4 eclipse in this new year. 2 we can see in India.