''లవ్‌ చెయ్యాలా వద్దాలో'' నలుగురు హీరోయిన్లు!

4 heroines are acting in Love Cheyyaala Oddhaa movie

05:47 PM ON 5th December, 2015 By Mirchi Vilas

   4 heroines are acting in Love Cheyyaala Oddhaa movie

'ఉందిలే మంచి కాలం ముందు ముందునా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకడు కార్తీక్‌. ఈ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ''లవ్‌ చెయ్యాలా వద్దా'. ఈ చిత్రానికి నౌషద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్‌ సరసన శ్వేతా వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో మరో ముగ్గురు కథానాయకలు ప్రియాంక రాథోడ్‌, పావని, హనిజ కూడా నటిస్తున్నారు. దర్శకుడు నౌషద్‌ మాట్లాడుతూ 'లవ్‌ చెయ్యాలా వద్దా' చిత్రం ఒక మంచి లవ్‌స్టోరీగా తెరకెక్కుతుంది. ఇందులో నటీనటులు చాలా వరకు వైజాగ్‌ నుంచి వచ్చిన వారే. ఈ చిత్రం షూటింగ్‌ కూడా చాలా వరకు వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది.

ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నాను. ఇందులో 'గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్ సింగ్' టీమ్ కూడా నటించారు. వీళ్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణాగా నిలుస్తారు అని చెప్పారు. ఈ చిత్రానికి గౌతమ్‌ సంగీతం అందించగా జికె సినిమాస్‌ పతాకం పై జి.వి. సంతోష్‌ కుమార్‌ నిర్మించారు. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకాబోతుంది.

English summary

4 heroines are acting in Love Cheyyaala Oddhaa movie. This movie is directing by Naushad and heroine is Swetha Varma.