బాలుడి ప్రాణం తీసిన ప్లాస్టిక్ కవర్

4 Year Old boy Died Because Of Polythene Cover

10:43 AM ON 30th June, 2016 By Mirchi Vilas

4 Year Old boy Died Because Of Polythene Cover

ఇదో విషాద ఘటన ... అభం శుభం తెలియని బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నవమాసాలు మోసి.. కని..అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ నాలుగేళ్ల బాలుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రుల గుండెలు పిండేసింది. హృదయ విదారకమైన ఈ దురదృష్టకర ఘటన హైదరాబాద్ నిజాంపేట్ లో జరిగింది. ఇంతకీ బాలుడి ప్రాణాలు పోవడానికి కారణమైంది ఓ ప్లాస్టిక్ కవర్. శ్రీయాన్ అనే 4ఏళ్ల బాలుడు ప్లాస్టిక్ కవర్ తలకు తగిలించుకుని ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్ మెడకు చుట్టుకుపోయింది.

తలకు చట్టుకున్న ప్లాస్టిక్ కవర్ ను బయటకు తీయడం కుదరని ఆబాలుడు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుడి ఈ స్థితిలో పడిఉండటాన్ని గమనించిన తల్లి వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన తో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు దిగ్భ్రాంతి కి గురయ్యారు. అందరిని ఈ సంఘటన కలవర పారించింది.

ఇవి కూడా చదవండి:ఆత్మాహుతి దాడి నుంచి ఇద్దరు కొడుకులతో తప్పించుకున్న హృతిక్

ఇవి కూడా చదవండి:కేసీఆర్ కి గిన్సిస్ బుక్ లో చోటు !?

English summary

A four year old boy in Hyderabad was died by wrapping a polythene cover to his face. The 4 year old boy was playing with polythene cover and he was playing in his house then the polythene cover wrapped to the boy face and later his mother found this and rushed the boy into hospital by the boy died by taking treatment in the hospital.