వావ్... ఆ బ్రాంచిలో సింగిల్ డిపాజిట్ గా 40 కోట్లు!

40 crores in a single deposit

01:18 PM ON 29th November, 2016 By Mirchi Vilas

40 crores in a single deposit

పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో ఓపక్క సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, మరోపక్క బ్లాక్ మనీ రాయుళ్ల ఆగడాలు బయటపడుతున్నాయి. ఢిల్లీలోని కశ్మీరీ గేట్ బ్రాంచ్ యాక్సిస్ బ్యాంక్ లో ఏకంగా రూ. 40 కోట్ల ఓల్డ్ నోట్స్ డిపాజిట్ అయ్యాయి. దీంతో ఈ మొత్తాన్ని ఎవరు డిపాజిట్ చేశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్థాయిలో పాతనోట్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెబుతున్నారు. ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఇప్పటికే కొంతమంది పొలిటీషియన్స్, ఆఫీసర్స్, బిజినెస్ మేన్ల సన్నిహితులపై నిఘా పెట్టారు. కాగా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచితోపాటు ఇద్దరు మేనేజర్ల ఇళ్లలో ఐటీ అధికారులు మూడురోజులుగా దాడులు చేశారు.

1/3 Pages

నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల హెల్ప్ తోనే కొంతమంది గోల్డ్ బిజినెస్ మేన్లు, ఎంట్రీ ఆపరేటర్లు కలిసి పెద్దమొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. తమకు ఈ సాయం చేసినందుకు మేనేజర్లకు బ్లాక్ మనీ రాయుళ్లు రూ. 40 లక్షలు ముట్టచెప్పారట. ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు ఆ బ్రాంచిలో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారు. నవంబర్ 11 నుంచి 22 తేదీల మధ్య 40 కోట్లను డిపాజిట్ చేశారు. ఆ తర్వాత వాటిని ఆర్టీజీఎస్ ద్వారా వేరే అకౌంట్లలోకి బదిలీ చేసి బ్లాక్ కి వైట్ గా మార్చుకున్నారు.

English summary

40 crores in a single deposit