గాంధీ విగ్రహమే కదా అనుకున్నారు.. కానీ విగ్రహంలో 40 కేజీల బంగారం!

40 kilos gold in Gandhi statue

11:22 AM ON 21st September, 2016 By Mirchi Vilas

40 kilos gold in Gandhi statue

ఏదో గాంధీ విగ్రహమే కదా అనుకున్నారు ఇన్నాళ్లూ, అందుకే ఎవరూ పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు గాంధీ విగ్రహంలో బంగారం ఉందని తెలియడంతో అందరి దృష్టి అటే మళ్లింది. పైగా పైపై బంగారు పూతకాదు, అలాగని ఒక కేజీయా రెండు కేజీలో కాదు.. ఏకంగా 40 కేజీల బంగారం ఉన్నట్లు తెల్సింది. ఇంతకీ ఎక్కడంటే, తమిళనాడులోని పనరుతి జంక్షన్ లో పురాతన కాలం నాటి పార్కు ఉంది. అందులో ఓ గాంధీ విగ్రహం కూడా ఉంది. పార్కును ఎవరూ పట్టించుకోకపోవడంతో చెట్లు బాగా పెరిగి నిరూపయోగంగా మారింది. ఆ మున్సిపాల్టీ చైర్మన్ పనీర్ సెల్వం పార్కు అభివృద్ధి కోసం ఇటీవల రూ.30 లక్షలు కేటాయించారు. దీంతో దాన్ని అందంగా తీర్చిదిద్దే పనులు చేపట్టారు.

గాంధీ జయంతి సమీపిస్తుండంతో పార్కులోని విగ్రహానికి రంగు వేయించాలని నిర్ణయించారు. కార్మికులు గాంధీ విగ్రహనికి ఉన్న పాత రంగు తొలగించడంతో ఒక్కసారిగా అది తళుక్కుమంది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ హుటాహుటీన స్వర్ణకారులను రప్పించారు. 60 ఏళ్ళ నాటి ఆ గాంధీ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసినట్లు వారు గుర్తించారు. 200 కేజీల బరువున్న ఆ విగ్రహంలో సుమారు 40 కేజీల బంగారం ఉంటుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని పురాతన గాంధీ విగ్రహం ఒక్కసారిగా కొన్ని కోట్లు ఖరీదు చేస్తుందని తెలిసింది. ఇంకేముంది, దాని భద్రత కోసం సీసీటీవీ ఏర్పాటు చేయడంతోపాటు సెక్యూరిటీ గార్డుని కూడా నియమించారు. అన్నట్టు ఇలాంటి పంచలోహ విగ్రహాలు దేశ నాయకులవి చాలాచోట్ల వున్నాయి. ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చి షాకిస్తున్న ముసలి హీరో!

ఇది కూడా చదవండి: టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు

ఇది కూడా చదవండి: పెళ్లి చూపులుకి వెళ్ళాడు.. అమ్మాయికి నచ్చలేదని చెప్పినందుకు ఏం చేసాడో తెలుసా?

English summary

40 kilos gold in Gandhi statue. 40 kilgorams Gandhi statue founfd in Tamil Nadu, Panaruthi Junction park.