రోబో-2 బడ్జెట్‌ 400 కోట్లు!

400 crores budget for Robo-2

03:48 PM ON 17th December, 2015 By Mirchi Vilas

400 crores budget for Robo-2

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రోబో-2. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో 'ఐ' ఫేమ్‌ అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయ్‌. రోబో-2 తెలుగు-వెర్షన్‌కి పీఆర్వోగా వ్యవహరించబోతున్న బి.ఎ. రాజు స్వయంగా ఈ విషయాలను ప్రకటించారు. మొన్నటిదాకా రోబో-2 బడ్జెట్‌ 300 అంటేనే వామ్మో అనుకున్నాం కానీ ఇప్పుడు బాలీవుడ్‌ కి కూడా దిమ్మతిరిగేలా రోబో-2 బడ్జెట్‌ని అనౌన్స్ చేశారు. రోబో-2 కి మొత్తం 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు.

ఈ చిత్రం టైటిల్ రోబో-2 కాదు కేవలం '2.0' మాత్రమే అంటే రోబోకి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అని మాట. దీనికి 'సీక్వెల్‌ ఆఫ్‌ రోబో' అనేది క్యాప్‌షన్. శంకర్‌ కెరీర్‌లో తొలిసారి త్రీడీ చిత్రంగా ఇది తెరకెక్కబోతుంది. మొత్తం 400 కోట్లను 'లైకా ప్రొడక్షన్' సంస్ధే ఖర్చు పెడుతుంది. అంతే కాదు ఈ చిత్రంలో ఆర్నాల్డ్‌ లేదా హృతిక్‌ రోషన్‌ విలన్‌గా నటించడం లేదు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాడు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. జురాసిక్‌ పార్క్‌, ఐరన్‌మ్యాన్‌, ఎవెంజెర్స్ వంటి చిత్రాలకు యానిమాట్రిక్స్ టెక్నాలజీ సపోర్ట్‌ ఇచ్చిన 'లెగసీ' రోబో-2 ఎఫెక్ట్స్ కు పని చేయబోతుంది.

రోబో లో రజనీకాంత్‌ నటించిన వశీకరన్‌ (సైంటిస్ట్‌) పాత్రలో నిన్న మొదలైన షూటింగ్‌ లో రజనీ కనిపించారు. రోబో, బాహుబలి చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్‌ ఈ చిత్రానికి కూడా పని చేయబోతున్నాడు అని తెలియజేశారు.

English summary

400 crores budget for Robo-2. Akshay Kumar is acting as a villan in this film.