ఆమెకు 41- అతనికి 23-  ఇద్దరినీ కలిపింది ఫేస్ బుక్

41 Year Old American Lady Married 23 Year Old Ahmedabad Man

11:10 AM ON 12th April, 2016 By Mirchi Vilas

41 Year Old American Lady Married 23 Year Old Ahmedabad Man

అవును, ఆమె వయస్సు 41, అతని వయస్సు 23, సోషల్ మీడియా లో అగ్రగామిగా దూసుకుపోతున్న ఫేస్ బుక్ కారణంగా వారిద్దరి మధ్య చిగురించిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆలస్యం చేయకుండా భారతదేశంలోని మురికివాడలో ఉండే ఆ యువకుడి కోసం రెక్కలు కట్టుకుని అమెరికాకు చెందిన మహిళ వచ్చేసింది. ఇంకా, ఆలస్యమెందుకని వివాహం బంధంతో ఆ ప్రేమికులు ఏకమయ్యారు. వివరాల్లోకి వెళితే.. 41ఏళ్ల సదరు యువతి అమెరికాకి చెందిన ఎమిలీ. మోంటానా ప్రాంతంలో హెల్త్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తోంది. కాగా, ఆ 23ఏళ్ల అబ్బాయి హితేశ్ చావ్డాది భారతదేశంలోని అహ్మదాబాద్‌. మురికివాడలో నివసిస్తున్న ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు.

ఇవి కూడా చదవండి:సర్దార్ మూడు రోజుల కలక్షన్స్

ఎమిలీ, హితేశ్‌లకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. భాష సమస్య ఉన్నప్పటికీ.. గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ సాయంతో సంభాషించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఎమిలీ హితేశ్‌ని కలవాలనుకుంది. వెంటనే ఇండియాలో వాలిపోయి అతన్ని కలుసుకుంది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నారేమో గానీ.. ఇద్దరూ కలుసుకున్న రోజే హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. మొదటిసారి ఎమిలీని కలిసినప్పుడు తనలోని సింప్లిసిటీ ఎంతగానో ఆకట్టుకుందని హితేశ్‌ చెప్పాడు. హితేశ్‌ చాలా అమాయకుడని తన వద్ద ఎలాంటి దాపరికాలు చేయడని అది నచ్చే పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఎమిలీ తెలిపింది. అందరి తల్లిదండ్రుల్లాగే ఎమిలీ విషయంలో హితేశ్‌ తల్లిదండ్రులు తడబడ్డారు. వారి ప్రేమానురాగాలు చూసి నెమ్మదిగా వారూ అర్ధం చేసుకుని నూతన దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అయితే, వీరి ప్రేమ పెళ్లి ఇక్కడితో ఆగలేదు. హనీమూన్‌ కోసం ఎమిలీ తన భర్తను అమెరికా తీసుకెళుతోంది. ఇంకో విషయం ఈ నూతన దంపతులు ఇండియాలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఫేస్ బుక్ కాలం ఇది .

ఇవి కూడా చదవండి:

కోర్టు దగ్గరే భార్య గొంతు కోసేశాడు

24లో నాలుగు పాత్రల్లో సూర్యనే..

శ్రీజ ప్రతిభకు కేసీఆర్ మురిసిపోతూ... రూ.10లక్షలు

English summary

A 41 Year old Woman Named Emily got contacted through facebook with a 23 year old American Man. They two liked each other and They two married recently in Ahmedabad.