లీటర్ పెట్రోల్ తో 410 కిలో మీటర్లు తిరిగేయొచ్చు!

410 kilo metres for 1 litre petrol

12:31 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

410 kilo metres for 1 litre petrol

రోజు రోజుకి పెట్రోల్ ధరలు మండిపోతుండడంతో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి తన మేథాసంపత్తితో తయారు చేసిన మోటారు సైకిల్ భవిష్యత్తు ఇంధన కొరతకు ప్రత్యామ్నాయంగా ఉంటుందా అనిపిస్తోంది. ఈ మోటార్ సైకిల్ లో లీటరు పెట్రోల్ పోసి 410 కి.మీ. ప్రయాణించవచ్చని ఈ స్తూడెంట్ నిరూపించాడు. సాధారణంగా మోటారు బైక్ లు లీటరుకు 60-70 కి.మీ. మైలేజీ రావడం గొప్పగా ఉన్న ఈ రోజుల్లో ఈ విషయం అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా నిజమే.. నమ్మి తీరాల్సిందే. కర్ణాటకాలోని బాగల్ కోటె జిల్లా ముధోళ్ కు చెందిన ఉమేష్ అనే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ మోటార్ బైక్ తయారు చేశాడు.

1/3 Pages

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెకట్రానిక్స్(వేర్వేరు ఇంజినీరింగ్ పద్ధతులను మిళితం చేసి డిజైన్లను రూపొందించే విధానం) అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఐసీ, ఇంజిన్, రెండు బ్యాటరీలు, అల్ఫాసీట్, గేర్ బాక్స్, డీసీ మోటార్ సహాయంతో రూ. 40 వేల ఖర్చుతో ఈ బైకు రూపొందించాడు. సాధారణ బైకులో లీటరు పెట్రోలుతో మహా అయితే 80 కిలోమీటర్లు వెళ్లవచ్చని, తాను రూపొందించిన బైకులో లీటరు పెట్రోలుతోనే 410 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నాడు.

English summary

410 kilo metres for 1 litre petrol