'సర్దార్‌' సెట్‌కు 4.5 కోట్లా!!

4.5 crores set for Sardar Gabbar Singh

11:57 AM ON 5th January, 2016 By Mirchi Vilas

4.5 crores set for Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'గోపాలా గోపాలా' తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్‌ తీసుకుని నటిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఘాటింగ్‌ ఇటీవలే గుజరాత్‌ లో జరిగింది. మళ్లీ దాదాపు నెల రోజులు గ్యాప్‌ తరువాత రేపటి (జనవరి 5) నుండి హైదరాబాద్‌ లో రెండో షెడ్యూల్‌ మొదలు కానుంది. అయితే ఈ ఘాటింగ్‌కి సంబంధించి ఒక హాట్‌న్యూస్‌ బయటకి వచ్చింది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కోసం బంజారా హిల్స్‌లోని భూతబంగ్లా సమీపంలో ఒక వీధిని సెట్‌ వేశారట.

ఆ వీధి పక్కనే ఒక రైల్వేస్టేషన్‌ ని కూడా సెట్‌ వేశారట. ఆ రైల్వేస్టేషన్‌ బాగా రియలిస్టిక్గా కనిపించేందుకు నిజమైన రైలు భోగీలను కూడా తెచ్చి పెట్టారట. ఆ సెట్‌లో సర్దార్‌ మేజర్‌ ఘాటింగ్‌ని జరపబోతున్నారు, అందుకే పవన్‌ దగ్గరుండీ మరి ఈ సెట్‌ని డిజైన్‌ చేయించారట. ఈ సెట్‌ కోసం దాదాపు 4.5 కోట్లు ఖర్చు పెట్టారట. దాదాపు నెల రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా పాల్గొనబోతుందని సమాచారం. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదలవబోతుంది.

English summary

4.5 crores set for Sardar Gabbar Singh movie.