అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి కి 45రోజుల పండగ ఎందుకో తెలుసా

45 Day Festival Of Ahobilam Lord Sri Lakshmi Narasimha Swamy

12:49 PM ON 28th December, 2016 By Mirchi Vilas

45 Day Festival Of Ahobilam Lord Sri Lakshmi Narasimha Swamy

ఒక్కో క్షేత్రంలో ఒక్కో విశిష్టత. తిరుమల శ్రీవారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. శ్రీవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. భద్రాద్రి అంటే శ్రీరామ నవమి సందడి గుర్తొస్తుంది. అంతర్వేది నరసన్న కళ్యాణం, సింహాద్రి అప్పన్న కళ్యాణం ఇలా ఒక్కో క్షేత్రానికి ఒక్కో రకమైన పండగ ఉంటుంది. ఇక పండగంటే ఒకరోజు, మహా అయితే మూడురోజులు. అక్కడి పరిసరాల్లోని ముప్ఫై అయిదు గ్రామాల్లో మాత్రం... ఆ ఉత్సవాన్ని నలభై అయిదు రోజులు జరుపుకుంటారట. ఆ ఒకటిన్నర నెలా... ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులూ బంధుమిత్రులతో వూళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలూ గాజులూ చిరుతిళ్ల దుకాణాలే, ఇంతకీ ఎక్కడంటే అహోబిలంలో. ఇది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వుంది.ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రమిది. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువయ్యాడు. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు.

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి, వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు.

అదేమిటంటే, పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని. ‘పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను’ అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.

1/11 Pages

స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో ‘తెలుపు’లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే ‘తెలుపు.. ఎరుపు’ రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు.

English summary

Lord Sri Lakshmi Narasimha Swamy temple was famous in Ahobilam in Kurnool District and this temple was famous all over India. Here is the specialty of Ahobilam Sri Lord Lakshmi Narasimha Swamy.