'బాహుబలి 2' కి 45 రోజులు బ్రేక్

45 days break for Baahubali 2 movie

11:29 AM ON 27th April, 2016 By Mirchi Vilas

45 days break for Baahubali 2 movie

దర్శకధీర రాజమౌళి సృష్టించిన ప్రభంజనం 'బాహుబలి'. ప్రభాస్, రమ్యకృష్ణ, నాజర్, అనుష్క, రానా, తమన్నా కలిసి నటించిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'బాహుబలి 2' తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు 'బాహుబలి 2' కి సమ్మర్ ఎఫెక్ట్ తగిలింది. మండే ఎండల కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కు సుమారు నెల రోజుల పాటు బ్రేక్ ఇవ్వాలని ఇటీవలే మేకర్స్ నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ బ్రేక్‌ను మొత్తం 45 రోజులకు పెంచినట్టు తెలుస్తోంది. మే నెల 1 నుంచి జూన్ 15 వరకు యూనిట్ షూటింగ్ నిలిపివేస్తుందని దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్‌ను కొంతమంది ఆర్టిస్టులతో కంటిన్యూ చేస్తున్నారట. ఇది ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ప్రభాస్, అనుష్క మరికొంత మంది మాత్రం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బ్రేక్ ఇచ్చిన సమయంలో రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్తాడని, హీరో ప్రభాస్ యూఎస్‌కు, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌కు టెంపరేచర్ చేరుకోవడంతో ఇక ‘బాహుబలి-2’ యూనిట్‌కు రెస్ట్ ఇవ్వక తప్పింది కాదు. ఏది ఏమైనా 2017 ఏప్రిల్ 14న మూవీ రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ కట్టుబడి ఉన్నారు.

English summary

45 days break for Baahubali 2 movie