ఫోర్బ్స్‌ '30 అండర్ 30'లో 45 మంది ఇండియన్స్

45 Indians In Forbes 30 Under 30 List

04:40 PM ON 6th January, 2016 By Mirchi Vilas

45 Indians In Forbes 30 Under 30 List

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మేగజైన్ విడుదల చేసిన 30 ఏళ్లలోపు గొప్ప విజయాలను సాధించిన వారి జాబితాలో 45 మంది భారతీయులకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతికత, విద్య, మీడియా, ఉత్పత్తి, న్యాయ, సామాజికం వంటి 20 రంగాల్లో విశేష మార్పు సాధించిన 600 మంది యువతీయువకుల పేర్లతో ఫోర్బ్స్ '30 అండర్ 30' అనే జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో 30 సంవత్సరాలలోపే అద్భుతమైన ప్రతిభ చూపి గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదిగినవారికి, సృజనాత్మకమైన నాయకులకు ఇందులో చోటు దక్కింది. గతంలో యుక్త వయస్సులోనే విజయాలు సాధించిన వారి సంఖ్య చాలా తక్కువ. కానీ నేటి డిజిటల్‌ యుగంలో వారు పెద్ద పెద్ద ఆశయాలు వాటికి తగిన ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతున్నారు. ముప్ఫై ఏళ్లలోపే విజయాలు సాధించడం వల్ల ఈ తరానికి అదనపు ప్రయాజనాలున్నాయి. ఓయో రూమ్స్ సీఈవో 28 ఏళ్ల రితేష్‌ అగర్వాల్‌, ఆరోగ్యకరమైన ఆహారాన్ని బుకింగ్‌పై సరఫరా చేసేలా యాప్‌ రూపొందించిన గగన్‌ బియాని(28), నీరజ్‌ బెర్రీ(28), గూగుల్‌ ఆల్ఫాబెట్స్‌కు పనిచేస్తున్న కరీష్మా షా(25), డిటి గ్రూపు ఉపాధ్యక్షుడు నీరా దాస్‌(27), ఆశిష్‌ కుమ్బాట్‌, దీపయన్‌ ఘోష్‌(న్యాయం), సాగర్‌ గోవిల్‌(సీఈవో సిమెట్రిక్స్‌), సంగమ్‌ గోర్గ్‌(వైద్యం) వంటి పలువురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

English summary

Forty five Indians and Indian- origin people have made it to Forbes' annual list of achievers in the US under the age of 30 who are "changing the rules of the game or creating entirely new playbooks" across varied fields.