యశోదా ఆసుపత్రికి 47 లక్షల ఫైన్

47 Lakhs Fine To Hyderabad Yashoda Hospital

10:57 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

47 Lakhs Fine To Hyderabad Yashoda Hospital

సక్రమంగా వైద్య చికిత్స చేయకపోవడం తో సదరు ఆసుపత్రిలో మరణించిన ఓ పోలీసు కుటుంబానికి పరిహారంగా రూ. 47 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని నేషనల్ కన్‌స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఆదేశించింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌‌లోని యశోదా ఆసుపత్రి .2008 మే నెలలో డి.సదాశివరెడ్డి అనే పోలీస్ జాండీస్ తో బాధపడుతూ ఈ ఆస్పత్రిలో చేరగా అతనికి చికిత్స చేసిన డాక్టర్లు ప్రొఫోల్ అనే డ్రగ్‌‌తో కూడిన అనేస్తిషియా ఇచ్చారు. అయితే దీంతో అతనికి ఇతర రుగ్మతలు కూడా సోకి కోమాలోకి వెళ్ళాడు. అతడు కోలుకుంటాడని వైద్యులు చెబుతూ వచ్చినప్పటికీ అతని పరిస్థితిదిగజారుతూ వచ్చింది.

ఇవి కూడా చదవండి: శవంతో కోరిక తీర్చుకున్న కామాంధుడు

అతని బ్రెయిన్ డెడ్ అయింది. చివరకు 2009 లో సదాశివ రెడ్డి మరణించాడు. దీని పై ఆయన భార్య ఉమాదేవి రాష్ట్ర వినియోగదారుల ట్రిబ్యునల్‌కి ఎక్కగా అతని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది అయినప్పటికీ ఆమె జాతీయ వినియోగదారుల ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.అటు యశోదా ఆసుపత్రివర్గాలు కూడా తమ వాదనను వినిపించాయి.దీనిని విచారించిన జస్టిస్ జె.ఎం.మాలిక్, కమిషన్ మెంబర్ ఎస్.ఎం. కాంతికర్ ఈ మేరకు యశోదా ఆస్పత్రిని ఆదేశించారు.ఈ ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు అభిప్రాయపడ్డారు.ఇది సంచలనం సృష్టిచింది.

ఇవి కూడా చదవండి: బికినీ ఫోజులతో హీటెక్కిస్తున్న రాధిక ఆప్టే

ఇవి కూడా చదవండి: నితిన్ నా తమ్ముడిలా అనిపించాడు

English summary

A Police named Sada Shiva Reddy Joined in Hyderabad Yashoda Hospital with Jaundice in May 2008. Later Doctor's gave one drug to that patient and then he gone into Coma. Later He died. Police wife complained to Consumer Disputes Redressal Commission by saying that doctors of Yashoda Hospital Does not gave proper treatment to his Husband .Consumer Disputes Redressal Commission ordered Yashoda hospitals to Pay 47 Lakh Rupees To Police Wife.