సౌదీలో 47 మందికి మరణశిక్ష

47 people sentenced to death in Saudi

07:32 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

47 people sentenced to death in Saudi

ఉగ్రవాద ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్న షియా మత పెద్ద షేక్ నిమ్ అల్- నిమ్‌క్రుతో పాటు 47 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షను అమలు చేసింది. 2011లో సౌదీ అరేబియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్ తన నిరసన గళం వినిపించారు. అప్పుడు చెలరేగిన విప్లవంలో నిమ్ కీలక పాత్ర పోషించారు. రెండేళ్ల క్రితం అతన్ని అరెస్టు చేశారు. శనివారం ఉరితీసిన నిందితులంతా 2003 నుంచి 2006 వరకు ఆల్ ఖయిదా ఉగ్రవాద సంస్థకు పనిచేశారు. షియా నేత నిమ్‌క్రు మరణశిక్ష అమలు చేస్తే సౌదీ అరేబియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలో ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరణశిక్షను రద్దు చేయాలంటూ గత ఏడాది అక్టోబర్‌లో నిమ్ పెట్టుకున్న అభ్యర్థనను సౌదీ అరేబియా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

English summary

Saudi Arabia punishes 47 people for terrorism, including a prominent Shia cleric, as executions reach highest level since 1995