రాతి యుగం నాటి తల్లీ బిడ్డల అస్థికలు

4800 year old fossils found in Taiwan

12:26 PM ON 26th May, 2016 By Mirchi Vilas

4800 year old fossils found in Taiwan

అవునా, అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. సెంట్రల్ తైవాన్లో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఎప్పుడో వేల ఏళ్ళ నాటి శిలాజాలు కనబడి ఖంగుతిన్నారు. ఓ తల్లి తన చిన్నారి బిడ్డను ఎత్తుకుని లాలిస్తున్నట్టు ఉన్న ఓ ఫాసిల్ బయట పడింది. ఇది సుమారు 4,800 ఏళ్ళ క్రితం నాటిదని భావిస్తున్నారు. అక్కడి తాయ్చుంగ్ ప్రాంతంలో ఏడాదిగా వీళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు దాదాపు 48 సెట్ల శిలాజాలు బయటపడ్డాయి. వీటిలో ముఖ్యంగా ఈ తల్లీబిడ్డల ఫాసిల్ వీళ్ళను బాగా ఆకర్షించింది.

బహుశా ఆ మదర్ అయిదడుగుల రెండంగుళాలు, చిన్నారి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండవచ్చునని అంచనా వేశారు. ఇవి నాటి రాతి యుగంలోని నియోలితిక్ ఏజ్లోనివని అంటున్నారు. ఏమైనా మదర్, చైల్డ్ ఫాసిల్స్ కంటబడడం విశేషం గా చెప్పుకుంటున్నారు. వీటిని భద్రపరచి పరిశోధనలు కొనసాగిస్తామని ఆర్కియాలజిస్టులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోనన్న టాప్ హీరోయిన్

ఇవి కూడా చదవండి:సమంతకు కాబోయే అత్త-మామలు వార్నింగ్

English summary

Taiwan Archaeologists found old fossil of a mother cradling her baby in Taiwan . Archaeologists were saying that it was a 4800 year old fossil.