సీట్లు కదులుతాయ్ ... థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్... 4 డి థియేటర్

4D theatre to be opened in Kuwait

02:44 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

4D theatre to be opened in Kuwait

సాంకేతికంగా వస్తున్న అభివృద్ధిని అందిపుచ్చుకుంటేనే ముందుకు వెళ్తాం. అది ఏ రంగమైనా సరే. కువైట్ ఇదే చేస్తోంది. సినీ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే మరి. అక్కడ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన 4డి థియేటర్ వచ్చే నెలలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సెలిమ్ రమియా అండ్ కో ఆధ్వర్యంలోని గ్రాండ్ సినిమాస్ ప్రకటించింది. కువైట్లోనే మొట్టమొదటి 4డి సినిమా టెక్నాలజీ ఎంఎక్స్4డీ(ఆర్)ను గ్రాండ్ అల్-హమ్రా లగ్జరీ సెంటర్ లో ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ పేర్కొంది. 4డీ టెక్నాలజీ సాయంతో ప్రదర్శించే సినిమాలు వీక్షించే ప్రేక్షకులకు సరికొత్త ఆనందానుభూతులు సొంతమవుతాయి. అది సినిమానా లేక మన కళ్లముందే సజీవంగా జరుగుతోందా అన్నట్టుగా ఉంటుంది. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇందుకోసం థియేటర్లో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేస్తారు. సీట్ల నుంచి లైటింగ్ వరకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. సినిమాలో వచ్చే సీన్లకు అనుగుణంగా సీట్లు కదులుతుంటాయి. మునివేళ్లపై నిలబెడతాయి. అంతేకాక ఎయిర్ బ్లాస్ట్, వాటర్ స్ప్రే, మంచు, వాసన వంటి వాటిని ప్రత్యక్షంగా అనుభవించే వీలుంటుంది. అల్-హమ్రా లగ్జరీ సెంటర్లోని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ థియేటర్లో జులైలో ఎంఎక్స్4డీ ని ప్రారంబించనున్నట్టు గ్రాండ్ సినిమాస్కు చెందిన జీన్ రమియా పేర్కొన్నారు. సినిమా చూసే ప్రతీ ఒక్కరికీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ సొంతమవుతుందని అంటున్నారు.

ఇది కూడా చూడండి:ఈ ఎఫెక్టివ్ డ్రింక్ సేవిస్తే, దగ్గు, శ్వాసకోశ సమస్యలు మాయం

ఇది కూడా చూడండి:ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

ఇది కూడా చూడండి:ఆ విషయంలో 'నాగ్' చెప్పినట్టే 'చిరు' చేస్తాడు

English summary

4D theatre to be opened in Kuwait.