ఏపీ సీఎం చంద్రబాబుని ఆ చిన్నారి ఏమందో తెలుసా?

4th class girl wrote a letter to CM Chandrababu

12:36 PM ON 1st September, 2016 By Mirchi Vilas

4th class girl wrote a letter to CM Chandrababu

ప్రజాస్వామ్యంలో పాలన సాగించేవాళ్లను ఎవరైనా మెచ్చుకోవచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు. అయితే చిన్నారులు కూడా ఈ మధ్య ఈ పని సులువుగా చేసేస్తున్నారు. పైగా పెద్దవాళ్ళ కంటే చిన్నారులు చేసేదానికి స్పందన ఎక్కువ ఉంటోంది. ఇదీ అలాంటిదే. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కృష్ణా పుష్కరాలు ముగిసిన నేపథ్యంలో, ఓ చిన్నారి స్పందించింది. కృష్ణా పుష్కరాలను బాగా నిర్వహించారు. విజయవాడలో విద్యుద్దీప కాంతులు నన్ను ఎంతగానో అలరించాయి. ప్రభుత్వ పనితీరు భేష్ అని ప్రశంసిస్తూ ఓ చిన్నారి, సీఎం చంద్రబాబుకి లేఖ రాసింది. దీనిపై సీఎం స్పందించారు. నీ లేఖ నా మనస్సుకు హత్తుకుంది.

నీ మెప్పు ఎంతో సంతృప్తినిచ్చింది అంటూ తిరిగి ఆ చిన్నారికి లేఖ రాశారు. గుంటూరు జిల్లాకు చెందిన నాలుగో తరగతి చిన్నారి ఎల్.అమృత మైత్రేయి ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖ ఆగస్టు 27న సీఎం కార్యాలయానికి చేరింది. మంగళవారం ఆ లేఖ సీఎం దృష్టికి వచ్చింది. దానిని చూసి సంతోషించిన సీఎం వెంటనే ఆ చిన్నారికి సమాధానంగా ప్రత్యుత్తరం పంపారు.

1/3 Pages

పోలీసు అంకుల్స్ బాగా సహకరించారు..


గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నా నమష్కారాలు. నా పేరు అమృత మైత్రేయి. నేను 4వ తరగతి చదువుతున్నా. కృష్ణా పుష్కరాలకు విజయవాడకు కుటుంబమంతా వచ్చాము. ఇక్కడ మీరు ఏర్పాట్లు చేసిన ఘాట్లు అన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయి. విద్యుత్ కాంతులతో నూతన రాజధాని మమ్మల్ని ఎంతగానో అలరించింది. పోలీసు అంకుల్స్ అందరు బాగా సహకరించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ట్యాగ్ లతో అలర్ట్ గా ఉంచారు. సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఎంతగానో అలరించాయి. మీరు ఇలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ముందుకు నడవాలి అని ఆశిస్తున్నాము. థ్యాంక్యూ సర్ అంటూ చిన్నారి అమృత లేఖ రాసింది.

English summary

4th class girl wrote a letter to CM Chandrababu. 4th class Guntur girl wrote a letter to AP CM Chandrababu Naidu about Krishna Pushkaralu.