'సర్దార్‌' లో 5 కోట్ల విలేజ్‌!!

5 crores set for Sardar Gabbar Singh

02:01 PM ON 25th January, 2016 By Mirchi Vilas

5 crores set for Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమా పనులు మొదలు పెట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు దాటింది. కానీ ఈ సినిమా ఆలస్యమవుతునే వస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే దీనికి కారణం ఏంటో భయటపడింది. ఈ సినిమాను పవన్‌ చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాగా పరిగణలోకి తీసుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ పనినీ చాలా శ్రద్దగా దగ్గరుండి చూసుకుంటున్నాడట పవన్‌. ఇటీవల హైదరాబాద్‌ లో 5 కోట్లతో ఒక విలేజ్‌ సెట్‌ను ఈ సినిమా కోసం వేశారు.

ఈ సెట్‌లో ఉన్న విలేజ్‌ సహజంగా కనిపించేెందుకు పవన్‌ చాలా శ్రద్ద వహిస్తున్నారట. ఇల్లు, మార్కెట్‌, షాపులు, రైల్వేట్రాక్‌ ఇవన్నీ సహజంగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారట. ఈ విలేజ్‌ సెట్‌కు సంబంధించిన ఎంట్రెన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ లు ఎలా ఉండాలో చూస్తున్నాడట పవన్‌. ఈ విలేజ్‌సెట్‌ చాలా సహజంగా కనిపించే విధంగా పవన్‌ తీర్చిదిద్దాడట. ఈ సెట్‌ సినిమాకి చాలా హైలైట్‌ అవుతుందట. దీంతో పవన్‌ తనకి నచ్చే వరకూ సెట్‌లో మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఈ నెల చివరికి ఈ సెట్‌లో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.

English summary

5 crores village set for Power Star Pawan Kalyan's Sardar Gabbar Singh movie. Pawan is seeing every technical problem for Sardar Gabbar Singh movie. He only selecting every set details. Kajal Agarwal is romancing with Pawan Kalyan in this movie.