తల్లికి కర్మకాండ చేసిన చిన్నారులు

5 daughters did kharmakhanda for their mother

11:29 AM ON 19th August, 2016 By Mirchi Vilas

5 daughters did kharmakhanda for their mother

ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదు. లేకపోతే, బడికి వెళ్లి ఓనమాలు దిద్దాల్సిన వయస్సులో తల్లికి కర్మకాండ చేయాల్సిన పరిస్థితి వారికి దాపురించడం ఏమిటి? అంతచిన్న వయస్సులోనే వారు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఇటీవల మృతి చెందిన తల్లి కర్మకాండలను గురువారం ఆ చిన్నారులే పూర్తి చేశారు. కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండలం నడింపల్లెకు చెందిన మడితప్పు శివయ్య, బుజ్జమ్మల కుమార్తెలు శిరీష, ప్రసన్న, మల్లిక, నందిని, విజిత. అయిదుగురు ఆడపిల్లలను పోషించలేని స్థితిలో వారి తండ్రి శివయ్య 11 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వారికి తల్లే దిక్కయ్యింది. ఈమె కూడా పిల్లలను పోషించలేక 14 రోజుల కిందట విషంతాగి ఆత్మహత్య చేసుకుంది.

దీంతో ఈ అయిదుగురు ఆడపిల్లలు అనాథలైన విషయాన్ని ఓ మీడియా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా కథనాలు ప్రచురించడంతో ఎంతోమంది స్పందించారు. దాతలు నగదు, వస్తువుల రూపంలో విరాళాలు అందజేశారు. సినీ నటుడు రాజా స్పందించి వారి విద్యాభ్యాసాలు తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ స్పందించి వారికి ఆపన్నహస్తాలు అందిస్తున్న విషయం విదితమే. కాగా గురువారం తల్లి బుజ్జమ్మ కర్మకాండను నడింపల్లెలో ఆ చిట్టితల్లులు నిర్వహించారు. సమాధి దగ్గర వారు భోరుమని విలపించారు. ఇంటివద్ద తండ్రి శివయ్య, తల్లి బుజ్జమ్మల చిత్రపటాలకు పూలుచల్లి నివాళి అర్పించారు. ఇక తమకు దిక్కుఎవరని పిల్లలు బంధువుల వద్ద విలపించారు.

English summary

5 daughters did kharmakhanda for their mother