ఏకంగా 5రోజులు మూతపడనున్న బ్యాంకులు

5 days holidays for banks

03:46 PM ON 6th October, 2016 By Mirchi Vilas

5 days holidays for banks

ఈరోజుల్లో ప్రతీది బ్యాంకుతోనే ముడిపడి వుందని అందరికీ తెల్సిందే. ఏటిఎం కార్డులున్నా నిత్య లావాదేవీలతో బ్యాంకులు రద్దీగానీ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా 5రోజులు బ్యాంకులు మూతపడబోతున్నాయి. బ్యాంకులకు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి 12వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఎనిమిదో తేదీన రెండో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తర్వాత 9వ తేదీ ఆదివారం, 10వ తేదీ ఆయుధ పూజ, 11వ తేదీ మంగళవారం విజయదశమి, 12వ తేదీన మొహర్రం పండుగలు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

English summary

5 days holidays for banks