ఏటీఎంలో డబ్బులు నింపే వ్యాన్ నుంచి.. నగదు దోపిడీ

5 Lakhs Theft From ATM Van in Delhi

11:42 AM ON 20th December, 2016 By Mirchi Vilas

5 Lakhs Theft From ATM Van in Delhi

దొంగతనానికి ఏదీ అడ్డురాదని చందంగా పరిస్థితులు మారిపోయాయి. ఏటీఎం లను పగులగొట్టి దోపీడీలు చేయడానికి ప్రయత్నించే వాళ్ళను చూసాం. తాజాగా ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ఆగిన వ్యాన్ నుంచి రూ.5 లక్షల కొత్త కరెన్సీని దుండగులు దోపిడీ చేశారు. బైక్ పై వచ్చిన ముగ్గురు, వ్యాన్ డ్రైవర్ ను తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఈ సంఘటన జరిగింది. పాండవ్ నగర్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వ్యాన్ ను నిలిపారు. డ్రైవర్ డబ్బుల సంచులను బయటకు తీస్తుండగా హెల్మెట్లతో బైక్ లపై వచ్చిన ముగ్గురు గన్ తో అతడిని బెదిరించారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు తేరుకునేలోపు డబ్బుల మూటలతో మాయమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:24గంటల్లో 20 లక్షల వ్యూస్ తో మెగా రికార్డు

ఇవి కూడా చదవండి: అందానికి కాదు సత్తాకు ఉద్యోగం ఇవ్వాలన్న అమ్మాయి .. ఇంతకీ ఏమైందో తెలుసా

English summary

Three Armed man with helmets came on bike and they theft 5 lakh rupees from a ATM money van in Delhi. Police filed complaint on this and they were investigating with the CC Tv footage.