పెన్నా వంతెనపై ప్రమాదంలో 5 గురు మృతి 

5 People Dead In Road Accident In Nellore

12:19 PM ON 24th November, 2015 By Mirchi Vilas

5 People Dead In Road Accident In  Nellore

వర్షాల ప్రభావం నుంచి ఇంకా కోలుకొని సింహపురిలో (నెల్లూరు )లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నెల్లూరు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతిచెందారు. పట్టణంలోగల కొత్త పెన్నానది వంతెనపై రెండు లారీలు డీకొనగా , ఈ రెండింటి మధ్య ఓ ఆటో నుజ్జు నుజ్జు అయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ క్యాబిన్ లో ఇరుకున్న వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. . కాగా... మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Five People Died In Road Accident In Nellore.Auto Srucks In Between two Lorries. Five People Died In This Accident