నదిలోకి దూసుకెళ్లిన కారు - 5గురు మృతి 

5 People died by falling by car in Godavari river

11:57 AM ON 12th December, 2015 By Mirchi Vilas

5 People died by falling by car in Godavari river

కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గ పరిధిలోని దరియాల తిప్ప దగ్గర ఏటిగట్టు నుంచి గోదావరి (గౌతమీ) నదిలోకి కారు దూసుకెళ్లింది. దీంతో కారులోని 5గురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు వున్నారు. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్ళిన వాళ్ళు కారుని గుర్తించి సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. హుటాహుటీన పోలీసులు రంగప్రవేశం చేసి , అగ్నిమాపక సిబ్బంది సాయంతో కారును వెలికి తీసారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తెల్లవారుఝామున ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కి తరలించి , కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Five people died by falling accidentally with car in godavari river