మొహం మీద ముడతలతో బాధ పడుతున్నారా ?

5 ways to remove wrinkles on your face

05:30 PM ON 14th November, 2015 By Mirchi Vilas

5 ways to remove wrinkles on your face

ముడతలు వస్తున్నాయి అంటే దాని అర్ధం వయస్సు పైబడుతుంది అని. ప్రస్తుత కాలం లో మగ ఆడ అనే తేడాలు లేకుండా ప్రతిఒక్కరూ ఈ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. వాతావరణ కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని చిన్న వయస్సు లోనే అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇవి తగ్గించుకునే ప్రయత్నం లో మార్కెట్ లో లభించే  వివిధ రకాల కాస్మోటిక్స్ ని వాడి ఉన్న అందాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు. ఈ ముడతలకి ముఖ్య కారణం పొడి చర్మం ఇంకా పోషకాహార లోపం. వీటి వల్ల ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ లో లబించే కాస్మోటిక్స్ వాడే ముందు మీది ఎటువంటి చర్మం తెలుసుకొని దానికి సంబందించిన వాటిని మాత్రమే వాడాలి తొందరగా తగ్గిపోవాలి అని ఏవి పడితే అవి వాడకూడదు. దేని వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఇంకో పద్దతి కూడా ఉంది ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి  తగ్గించుకోవడం. చర్మాన్ని ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి దాని కోసం ఆయిల్ రాసుకోవడం మంచిది, దీని వల్ల చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది. చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ ఆంటీ-బ్యాక్టీరియ, ఆంటిసెప్టిక్ గుణాలనీ కలిగి ఉంటాయి వాటిని వాడడం వలన చర్మం ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా ఉంటుంది.
ఆయిల్ రెమెడీస్ వలన ముడతలు, చిన్న గీతలు, పొడిబారిపోవడం ఇలాంటి సమస్యలకు పరిష్కారం లబిస్తుంది.

1/6 Pages

ఆయిల్ రెమెడీస్ లో ముఖ్యమైనవి.
1.    బాదమ్ ఆయిల్, ఆలొవీరా, కోకో బటర్ క్రీమ్:


ఆలొవీరా లో ఎన్నో  ఔషధ గుణాలు ఉన్నాయి. కంటి కింద వలయాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. దేనిని సేవించడం కూడా మంచిదే. ప్రస్తుతం కొంత మంది డాక్టర్స్ కూడా సిఫార్స్ చేస్తున్నారు. 
తయారు చేయడానికి  కావాల్సినవి: 
•    పాత్ర-1
•    ఆలొవీరా జెల్ -4 టేబుల్ స్పూన్
•    కోకొ బటర్ -3  టేబుల్ స్పూన్
•    లేవేండెర్ ఆయిల్-3 నుండి 4 చుక్కలు
•    బాదం ఆయిల్-6  టేబుల్ స్పూన్

తయారు చేయువిదానము:
•    పాత్రని తీసుకొని అందులో ఒకదాని తరువాత మరొకటి తీసుకొని వేడి చేయాలి.
•    గోరువేచ్ఛగా వేడి చేయాలి మరి ఎక్కువ వేడి చేయకూడదు.
•    అన్ని ఒక్కసారిగా కలిపి వేడి చేయరాదు.
•    వేడి చేసిన అన్నిటినీ ఒక జార్ లోకి తీసుకొని 1 నుండి 2 నిమిషాల వరకు బాగా కలపాలి.
•    తర్వాత ఈ క్రీమ్ ని శుబ్రమైన దాంట్లో స్టోర్ చేయాలి.
•    శుబ్రపరిచిన ముఖానికి రోజుకి రెండు సార్లు రాసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ వయస్సు తగ్గిస్తుంది ఈ క్రీమ్. ముఖం మీద ముడతలు, కళ్ల కింద వలయాలు క్రమం గా తగ్గుముఖం  పడతాయి. 

English summary

5 ways to remove wrinkles on your face.Using home remedies to remove wrinkles on your face with in few days.