చుండ్రు సమస్యకి... కొబ్బరినూనె ఉపయోగాలు

5 ways to use Coconut oil for Dandruff

01:08 PM ON 30th November, 2015 By Mirchi Vilas

5 ways to use Coconut oil for Dandruff

కొబ్బరి నూనె సహజసిద్ధమైన ఔషదగుణాలు కలిగినది. దీనిని చర్మానికి రాసుకోవడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇది చుండ్రును తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. తలదురద సమస్య, జుట్టురాలుట, చర్మసమస్యలకు కొబ్బరినూనె అద్బుతమైన ఔషదం.

కొబ్బరినూనె పనిచేసే విధానం

పూర్వకాలం నుండి కొబ్బరినూనె వాడుకలో ఉంది. జుట్టు వత్తుగా పెరగడానికి, చుండ్రు సమస్యలకు, తెల్లనిజుట్టు అరికట్టడానికి ఆకాలంలో ఈ నూనెను వాడేవారు. వీటితో పాటు ఇది తలనొప్పిని కూడా అరికడుతుంది. దీనిలో యాంటి ఫంగస్‌ స్వబావం ఉండడం వలన చుండ్రు సమస్యను అరికట్టి దానికి కారణమైన ఫంగస్‌ ని చంపుతుంది.

 1. ఇది గొప్ప మాయిక్చరైజర్‌గా పనిచేస్తుంది. తలని పొడిబారనివ్వకుండా చేసి చుండ్రు సమస్య దరిచేరనివ్వదు.
 2. కొబ్బరినూనె కండిషనర్‌గా పని చేసి జుట్టుని మెత్తగా నిగనిగలాడే లా చేస్తుంది.
 3. జుట్టుని ఆరోగ్యవంతంగా ఉంచుతూ ఫంగస్‌ దరిచేరకుండా చూసుకుంటుంది. స్కాల్ప్‌ తో పాటుగా జుట్టుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
 4. చుండ్రు సమస్యవల్ల తలలో దురద మంట రాకుండా చేస్తుంది.
 5. దీనిలో పోషక విలువలు ఉండడంతో చుండ్రు ని అరికట్టడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

కొబ్బరినూనెను ఉపయోగించే విధానం

కొబ్బరినూనెను డైరెక్ట్‌గా లేదా వేరొక వాటిలో కలిపి కూడా వాడవచ్చు.

1. కొబ్బరినూనె

కొబ్బరినూనె వాడడం వల్ల చుండ్రు సమస్యను నివారించవచ్చు.

కావలసినవి:

 • వేడిచేసిన కొబ్బరినూనె - 2 టీ స్పూన్స్‌ ( లేదా ) మీ జుట్టు పొడవును బట్టి తీసుకోవాలి.
 • వేడినీళ్ళు - కావలసినన్ని
 • షవర్‌ క్యాప్‌ -1

ఉపయోగించే పద్ధతి:

 • ఒక కప్పులో 1 టీస్పూన్‌ వేడి చేసిన కొబ్బరినూనె ను తీసుకోవాలి.
 • వేడి చేసిన నూనెతో బాగా కుదుళ్ళకు పట్టే విధంగా వేళ్ళ తో మర్ధన చేసుకోవాలి.
 • ఈ విధంగా 5 నిమిషాలు చేయడం వలన రక్తప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది. అదేవిధంగా చుండ్రు సమస్యకూడా దూరం అవుతుంది.
 • షవర్‌ క్యాప్‌ని తలకి వేసుకొని రాత్రంతా తల ని నూనెతో నాన నివ్వాలి.
 • తరువాతి రోజు ఉదయం జుట్టుని షాంపూతో శుభ్రపరచుకోవాలి.
 • చుండ్రు సమస్యతో బాధపడేవారు రోజు ఈ పద్ధతిని పాటించడం వలన మంచి ఫలితం పొందుతారు.

గమనిక : సేంద్రియ (ఆర్గానిక్‌) కొబ్బరినూనె ని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది.

2. కొబ్బరినూనె మరియు నిమ్మరసం

కొబ్బరినూనెలో నిమ్మరసం కలపడం వలన చక్కటి ఫలితాలను పొందుతారు. నిమ్మకాయలో సిట్రిక్‌ యాసిడ్‌ ఉండడంచేత ఫంగస్‌ తో పోరాడం చేసి చుండ్రుని దరి చేరనివ్వదు.

కావలసినవి:

 • కొబ్బరినూనె -2 టీ స్పూన్‌
 • నిమ్మరసం -2 టీ స్పూన్‌

ఉపయోగించే పద్ధతి:

 • ముందుగా కొబ్బరినూనెని బాగా వేడిచేసి అందులో నిమ్మరసం కలపాలి.
 • వచ్చిన మిశ్రమాన్ని తలకి బాగా పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్‌ చేసి 20 నిమిషాల పాటు తలని నాననివ్వాలి.
 • 20 నిమిషాల అనంతరం మైల్డ్‌ షాంపూతో తలకి స్నానం చేయాలి.
 • ఈ ప్రక్రియని వారానికి 3 నుండి 4 సార్లు చేయడం వలన చుండ్రుని నివారించడంలో సహాయపడుతుంది.

3. కర్పూరం మరియు కొబ్బరినూనె

చుండ్రువలన కలిగే దురద, మంట వంటి సమస్యలను కర్పూరం వాడడం వలన తగ్గించుకోవచ్చు.

కావలసినవి:

 • కొబ్బరినూనె - అరకప్పు
 • కర్పూరం -1 టీ స్పూన్‌
 • గాలి చొరబడని కంటైనర్‌ -1

ఉపయోగించే పద్ధతి:

 • గాలిచొరబడని కంటైనర్‌ లో కర్పూరం మరియు కొబ్బరినూనె వేసి నిల్వచేయాలి.
 • చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు ఈ నూనెను చేతిలోకి తీసుకుని తలకి, కుదుళ్ళకి పట్టే విధంగా రాసుకొని 10 నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి.
 • ఇలా రెండు వారాలపాటు రోజూ రాత్రుళ్లు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

4. కొబ్బరినూనె, తేనె, ఆలివ్‌ఆయిల్‌ మరియు పెరుగు

తేనె మరియు పెరుగులో యాంటీ బ్యాక్టీరియాల్‌ లక్షణాలు ఉండడం వలన ఇవి కూడా చుండ్రుని నివారించడంలో తనవంతు సాయం చేస్తాయి. ఈ రెమిడీ వాడడంతో మూసుకుపోయిన రంద్రాలను సైతం మళ్ళీ తెరుచుకునేలా చేసి జుట్టుని మరింత ఆరోగ్యవంతంగా పెరిగేలా చేసి చుండ్రు సమస్యని దూరం చేస్తుంది.

కావలసినవి:

 • కొబ్బరినూనె - 2 టీస్పూన్‌
 • ఆలివ్‌ఆయిల్‌ - 2 టీస్పూన్‌
 • పెరుగు - 3 టీస్పూన్‌
 • తేనె - 2 టీస్పూన్‌

ఉపయోగించేపద్ధతి:

 • పైన తెల్పిన అన్నిటినీ కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకోవాలి.
 • వచ్చిన పేస్ట్‌ని కుదుళ్ళకి బాగా పట్టేలా రాసుకోవాలి.
 • ఈ విధంగా 10 నిమిషాల పాటు మసాజ్‌ చేసుకొని 40 లేదా 50 నిమిషాలు తలని బాగా నాననివ్వాలి.
 • ఈ విధంగా మసాజ్‌ చేయడం వలర రక్తప్రసరణ సక్రమంగా జరిగి పూడుకుపోయిన రంద్రాలు తెరుచుకోవడంలో సహాయపడుతుంది.
 • 40 నిమిషాల అనంతరం తలని షాంపూతో శుభ్రపరుచుకోవాలి. తలని సాధారణ ప్రక్రియలో ఆరనివ్వాలి.
 • తరువాత 4 లేదా 5 చుక్కలు కొబ్బరినూనెను చేతిలోకి తీసుకొని, రెండు చేతులను రుద్దీ కొంచెం వేడిగా మారిన అనంతరం ఆ నూనె ని తలకి పట్టించాలి. ఈ విధంగా జుట్టు మొత్తానికి నూనెను రాయాలి.
 • ఈ పద్ధతిని వారానికి ఒకసారి చేయడం వలన మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారు.

5. లావెండర్‌ ఆయిల్‌ మరియు కొబ్బరినూనె

లావెండర్‌ ఆయిల్‌లో యాంటిఫంగల్‌ గుణాలతో పాటు యాంటి ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉండడం వలన చుండ్రు సమస్యకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.

కావలసినవి:

 • కొబ్బరినూనె - 2టీస్పూన్‌
 • లావెండర్‌ - 20 నుండి 22 చుక్కలు
 • షవర్‌ క్యాప్‌-1

ఉపయోగించే పద్ధతి:

 • కొబ్బరినూనె, లావెండర్‌ ఆయిల్‌ రెండింటిని బాగా కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని కొద్ధిగా వేడిచేయాలి. గోరువెచ్చని నూనెను తలకి రాసుకుని వేళ్ళతో 10 నిమిషాలపాటు మసాజ్‌ చేసుకోవాలి.
 • అనంతరం మైల్డ్‌ షాంపూతో తలకి స్నానం చేయాలి.
 • ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడంవలన మంచి ఫలితం లభిస్తుంది.

ఇంట్లో ఉంటూ సులభం గా చుండ్రు సమస్యని తగ్గించుకునే విదానాలను చూసారుగా, వీటిలో మీకు నచ్చిన పద్దతిని పాటించి మీ చుండ్రు సమస్యను అరికట్టండి

English summary

5 ways to use Coconut oil for Dandruff. Since Ancient times, coconut oil has been used to treat various types of hair as well as scalp problem including dandruff.