గాలిపటాల్లో చైనా మాంజా వాడితే ... 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా..!

5 Years Jail And 1 Lakh Fine If You Use China Manjha Thread

11:17 AM ON 19th December, 2016 By Mirchi Vilas

5 Years Jail And 1 Lakh Fine If You Use China Manjha Thread

గాలిపటాలు ఎగరేయడం అందరికీ సరదాయే. కొన్ని చోట్ల పతంగుల పండగ చేస్తుంటారు. అందునా సంక్రాతి పండుగ వస్తుందంటే చాలు మన దేశంలో ఎక్కడ చూసినా పతంగుల సందడి మొలవుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పతంగులను ఎగుర వేస్తూ హ్యాపీగా గడుపుతారు. అన్ని రంగాలకు చెందిన ప్రజల్లోనూ ఆనందాలు నెలకొంటాయి. ఇక రైతులకైతే పంట చేతికి అందడం వలన సంతోషంగా ఉంటారు. అయితే ఎక్కడ చూసినా సంక్రాంతి పండక్కి ఉండే సందడి ఒకెత్తు. పతంగుల హల్చల్ మరో ఎత్తు. అయితే పతంగులను ఎగుర వేయడం వరకు బానే ఉన్నా, వాటి వల్ల జరుగుతున్న నష్టాలను మనం గమనించడం లేదు. ప్రధానంగా పతంగుల్లో వాడే మాంజా దారం చైనాలో తయారవుతుంది. మాంజాను వాడుతుండడంతో అటు పర్యావరణానికే కాదు, చిన్న పిల్లలకు, పక్షులకు కూడా తీవ్రమైన గాయాలవుతున్నాయని అంటున్నారు.

నైలాన్ దారానికి గాజు పొడి కోటింగ్ వేసి చైనా మాంజాను తయారు చేస్తున్నారు. దీంతో ఆ మాంజాను వాడినప్పుడు చిన్నపిల్లలకే కాదు పెద్దలకూ గాయాలవుతున్నాయి. అలా మాంజాలతో పతంగును ఎగురవేసినప్పుడు ఆ దారాలకు చిక్కుకుని పక్షులు మృతి చెందుతున్నాయి. పర్యావరణానికి కూడా ఈ మాంజాలతో ముప్పు ఉందని ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చైనా మాంజాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. సహజ సిద్దమైన దారంతో తయారు చేసిన మాంజాలనే వాడాలని సూచిస్తోంది.

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మినా, వినియోగించినా శిక్షార్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టంలోని సెక్షన్ H- 5, 15 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, లక్ష రూపాయలు ఆపైన జరిమానా విధిస్తారు. ప్రజల్లో చైనా మాంజా వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి చెందిన పలు శాఖల అధికారులు కూడా సమాయాత్తం అవుతున్నారు.

ఎవరైనా చైనా మాంజా వినియోగించినట్లు, అమ్ముతున్నట్లు తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నెం. 18004255364కు సమాచారం అందించవచ్చు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. సంప్రదాయబద్ధంగా తయారు చేసే కాటన్ మాంజాను వినియోగిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ఓ ఇంటి కింద 18 అంతస్తుల భూగర్భనగరం .... దీని గురించి వింటే షాకవుతారు

ఇవి కూడా చదవండి: వావ్ ఇదేం రూలండి - నడుం నాజూకుగా లేకుంటే టాక్స్ తప్పదట

English summary

Government of India taken a forward step to protect environment and to save birds also. This was the season of Kites in India and if anybody sell or use China Manjha thread to flew kites may get punished in Jail for 5 years and fined 1 lakh rupee fine also. By using this thread so many were injuring and so many birds were also dying. So central government was banned this thread.