స్నేహితుడి పెళ్ళికి చిల్లర ఇస్తే, ఏమైందో తెలుసా

50 and 100 rupees notes Gifted in a Marriage

12:05 PM ON 7th December, 2016 By Mirchi Vilas

50 and 100 rupees notes Gifted in a Marriage

రూ 500, రూ 1000 నోట్ల రద్దుతో ఓ పక్క రెండు వేల నోటుకి చిల్లర దొరక్క, మరోపక్క చిల్లర నోట్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లరకున్న అవసరం అంతా ఇంతా కాదు. ఈ విషయం అర్థంచేసుకున్న ఓ వ్యక్తి తన స్నేహితుడి పెళ్లికి చిల్లరను కానుకగా ఇచ్చాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ కి చెందిన పీయూష్ అదే ప్రాంతానికి చెందిన అను ఆదివారం రాత్రి వివాహం చేసుకున్నారు. పెళ్లికి హాజరైన వారంతా రకరకాల బహుమతులు తెస్తే పీయూష్ స్నేహితుడు వివేక్ మాత్రం వూహించని రీతిలో మొత్తం పదివేల రూపాయలను 100, 50, 10 రూపాయల నోట్ల రూపంలో బహుమతిగా ఇచ్చాడు. అది చూసి వధూవరులతో సహా పెళ్లికి వచ్చినవారంతా ముందు ఒకింత విస్తుపోయినా, తర్వాత అతడి ఆలోచనను అర్థం చేసుకుని ప్రశంసించారు. ప్రస్తుతం చిల్లరతో ఉన్న అవసరాన్ని అర్థంచేసుకుని వివేక్ చిల్లర బహుమతిగా ఇచ్చి చాలా సాయపడ్డాడని, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏ పెళ్లిలోనూ ఎవరూ ఇలాంటి కానుక ఇచ్చి ఉండరని పీయూష్ తెలిపాడు. మొత్తానికి చిన్న నోట్లకు భలే డిమాండ్ పెరిగింది.

ఇవి కూడా చదవండి: ఎం.జి.ఆర్ చనిపోయినపుడు జయను కొట్టిన నటుడెవరో తెలుసా

ఇవి కూడా చదవండి:ఆమె 5 అడుగులు ... అతడు అడుగున్నర.. అయినా ఇద్దరికీ కుదిరింది

English summary

People were struggling to get change of 100 rupees currency notes and they standing in Quee in front of banks and weird thing took place in a marriage that a friend gifted 10, 50 and 100 rupees notes. This was shocked by everyone over there.