రాష్ట్రంలో 50వేల పెళ్లిళ్లు వాయిదా... ఎందుకో తెలుసా?

50 thousand marriages were postponed in state

12:52 PM ON 5th December, 2016 By Mirchi Vilas

50 thousand marriages were postponed in state

తాను ఒకటి తలస్తే, దైవం ఒకటి తలచింది అంటారు కదా. ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లు చేసుకుందామనుకునే వారి పరిస్థితి అలానే తయారయింది. ఇదేమిటి అనుకుంటున్నారా? అవును పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా వుంది కదా. ముఖ్యంగా సామాన్యులపై ఎక్కువగానే వుంది. దైనందిన అవసరాలను తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుకోసం బ్యాంకులు - ఏటీఎంల వద్ద క్యూ లైన్లతో అవస్థలు పడుతున్నవాళ్లను చూస్తూనే వున్నాం. ఇక ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కొందరు నానా హైరానా పడుతున్నారు. తాజాగా వివాహ అవసరాలకు తగిన సొమ్ములు లేకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50వేల పెళ్లిల్లు రద్దు అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

1/5 Pages

పెళ్లి ఖర్చు కింద రెండున్నర లక్షల రూపాయలు బ్యాంకర్లు ఇస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వాస్తవంలో బ్యాంకర్లు చుక్కలు చూపిస్తుండటంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. వివాహ ఖర్చుల విషయంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకునేందుకు బ్యాంకులు వెళ్లిన కుటుంబాలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది.

English summary

50 thousand marriages were postponed in state