ఈ బ్యూటీల వయసెంతో తెలిస్తే దిమ్మ తిరిగినట్టే!

50 years beauties in China

01:06 PM ON 29th June, 2016 By Mirchi Vilas

50 years beauties in China

అందం మెయింటేన్ చేయడం ఓ కళ. కొందరికి వయస్సు తక్కువైనా ఎక్కువన్నట్లు కనబడతారు. మరికొందరు వయస్సు పెరిగినా చిన్నవాళ్లుగా కనిపిస్తారు. వ్యాయాయం వంటివి చేయడమే కదా బ్యూటీ టిప్స్ అనుసరించడం, వంటి పద్దతుల ద్వారా వయస్సు మీద పడ్డా ఆ ప్రభావం లేకుండా మెయింటేన్ చేస్తారు. అందుకే వయసుకు అందానికి ఏమాత్రం సంబంధంలేదని కొందరు బ్యూటీలు నిరూపిస్తున్నారు. నిజానికి మనం ఇక్కడ చూసే ముద్గుగుమ్మల వయస్సు 50 ఏళ్ళ వరకూ ఉంటుంది. ఈ చైనీస్ పడతి అందమైన ఫోటోలు చూస్తుంటే బామ్మను కూడా మనం బార్బీ బొమ్మ అనుకోవాల్సిన పరిస్థితే.

మరొక హాంకాంగ్ భామను చూసి ఈమె ముగ్గురు పిల్లల తల్లా అనుకోవాల్సిన పరిస్థితే. చైనాలో 138 కోట్ల మంది జనాల్లో ఈమధ్య ఓ 50 ఏళ్ళ బామ్మ దిగిన సెక్సీ అండ్ గ్లామరస్ ఫోటోలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఎంతలా అంటే అసలు ఆ ఫోటోలు చూసిన వాళ్ళెవరికైనా నిజంగా డౌట్ రావాల్సిందే ఈమెకి మనవరాలు ఉందా అని. 1966లో చైనాలో పుట్టిన కిన్ లింగ్ ఈ మధ్యే 50వ బర్త్డే జరుపుకుందట. అందుకోసం స్పెషల్ గా ఓ స్పెషల్ ఫోటోషూట్ జరిగిందట. ఆమె పెద్దకూతురు పట్టుపట్టి తల్లితో ఫోటోషూట్ చేసి, వాటిని ఇంటర్నెట్ లో పెట్టింది. పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయిన కిన్ లింగ్ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేసింది.

పిల్లలు సెటిల్ అయ్యాక సౌందర్య పోషణపై దృష్టిసారించింది. సహజంగానే మెరుపుతీగలా ఉండే ఈ బామ్మ.. బ్యూటీ కేర్ తో ఇంకా మెరిసిపోయింది. పడుకొనేటప్పుడు ఒంటిమీది దుస్తులన్నీ తీసేసి పడుకుంటుందట కిన్. అంతేగాక వారంలో ఒకసారి హాట్ బాత్ తీసుకోవడం, ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ లతో ప్రతీరోజు మొహాన్ని అందంగా ఉంచుకోవడం వల్లే 50ఏళ్ళ వయసులోనూ ఇంత యంగ్ గా కనిపిస్తోందని కిన్ చెబుతోంది. ఇంత యంగ్ గా ఉండడంతో ఇద్దరు కూతుర్లతో కలిసి చైనీస్ టాలెంట్ షో మామ్మా మియాలో పాల్గొని తన టాలెంట్ ని చూపించింది.

ఇంటర్నెట్ లో ఫోటోలు చూసి కిన్ కన్నా 20 ఏళ్ళ తక్కువ వయసున్నవాళ్ళు తనను పెళ్ళి చేసుకుంటామంటూ ఫోన్లు చేస్తున్నారట. చైనా బామ్మకు పోటీగా హాంకాంగ్ కి చెందిన 50ఏళ్ళ హాట్ మోడల్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముగ్గురు పిల్లల తల్లి అయిన కాండీ 1991లోనే మిస్ ఏషియా టైటిల్ ను గెలుచుకుంది. అయితే మోడలింగ్ కు బ్రేక్ తీసుకొని పిల్లలను పెంచి పెద్దచేసింది. అయితే రెండేళ్ళ క్రితం భర్తతో విడిపోయిన తర్వాత బాధ్యతలు పెరగడంతో మళ్ళీ మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఫోటోబుక్ ని విడుదలచేయగానే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అదండీ కధ.

ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడండి..

1/19 Pages

English summary

50 years beauties in China