32లక్షల కోట్లు ఏమయ్యాయి?

500 Billion Dollars Black Money flown out of India in 2004-13

10:39 AM ON 16th February, 2016 By Mirchi Vilas

500 Billion Dollars Black Money flown out of India in 2004-13

ఒకటి.. రెండు కాదు... ఏకంగా 500 బిలియన్ డాలర్ల బ్లాక్ మనీ విదేశాలకు తరలిపోయిందట..అంటే అక్షరాలా ఇది మన దేశ కరెన్సీలో 32లక్షల కోట్లకు పై మాటే. 2004-13 మధ్య ఈ మొత్తం దేశం దాటిపోయిందట.. యూపీఏ అధికారంలో ఉన్న ఈ కాలంలో 505 బిలియన్ డాలర్ల బ్లాక్ మనీ దేశం నుంచి తరలిపోయిందా అని డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)ని సిట్‌ ప్రశ్నించింది. దేశం నుంచి తరలిపోతున్న నల్లధనంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అమెరికాకు చెందిన థింక్‌ ట్యాంక్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ ఇంటిగ్రిటి నివేదిక ప్రకారం ప్రపంచంలో వివిధ దేశాల నుంచి తరలిపోతున్న నల్లధనం విషయంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. 2004-2013 మధ్య ఏటా దేశం నుంచి 51 బిలియన్‌ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలిపోయింది. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటి నుంచి దేశాల వారీగా నల్లధనానికి సంబంధించిన లెక్కలను సిట్‌ బృందం సేకరించింది. ఆయా సంవత్సరాల్లో నల్లధనం ఎంత తరలిపోయిందో వివరాలు అందులో ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ వివరాలను డీఆర్‌ఐకి ఫిబ్రవరి 8న పంపామని, అవి సరైనవో కాదో తేల్చమని కోరినట్లు వివరించింది. డీఆర్‌ఐ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సిట్‌ వెల్లడించింది.

English summary

The Supreme Court of India appointed Special Investigation Team on black money has asked the Directorate of Revenue Intelligence (DRI) to verify whether USD 505 billion had flown out of the country during 2004-13.