2020నాటికి 500కోట్ల మంది నెటిజన్లు

500 Crore People Uses Internet By 2020

11:53 AM ON 21st November, 2015 By Mirchi Vilas

500 Crore People Uses Internet By 2020

2020వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 500కోట్ల మంది నెటిజన్లు పుట్టుకొస్తారని గూగుల్‌ తాజాగా తమ అధ్యయనంలో తెలిపింది. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతీఒక్కరూ కూడా ఇంటర్నెట్‌ లేని జీవితాన్ని చూడలేరన్న మాట. ఇప్పటికే ప్రతీ ఒక్కరి జీవితంలో తొంగిచూసిన ఇంటర్నెట్‌ వచ్చే ఐదు సంవత్సరాలలో మరింత అభివృద్ధి చెందుతుందన్న మాట. రానున్న కాలంలో ఇంటర్నెట్‌ ఆధారిత టెక్నాలజీలు, కంపెనీలు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పేరిట ప్రపంచంలో ప్రతీ వస్తువుని కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసే టెక్నాలజీని అభివృద్ధి పరుస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే రవాణా వ్యవస్థను, ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే సరికొత్త వ్యవస్థలను చూడచ్చేమో. గడిచిన ఐదేళ్ళలో ఇంటర్నెట్‌ వాడకం గణణీయంగా పెరిగింది. భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఎలాంటి అధ్బుతాలను మానవాళికి అందిస్తుందో వేచి చూడాల్సిందే.


English summary

Over 500 Million Internet Users in by 2020,internet users count increasing by day by day.