రూ. 500 నోట్లను తప్పుగా ముద్రించారా? లేక దొంగ నోట్లా..

500 fake notes or real notes

11:58 AM ON 18th June, 2016 By Mirchi Vilas

500 fake notes or real notes

తప్పు జరగడం సహజం కానీ కరెన్సీ నోట్ల విషయంలో తప్పు దొర్లితే, ఇక అందరికీ బేజారె. తాజా సంఘటన అందుకు ఉదాహరణ. రెండేళ్ల అనంతరం చెలామణీలోకి రావలసిన రూ. 500 నోట్లు ఇప్పటికే అందుబాటులోకి రావడంతో ప్రజలు గందరగోళం చెందుతున్నారు. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ముద్రించి, బ్యాంకులకు సరఫరా చేసే నోట్లలో వాటిని విడుదల చేసిన సంవత్సరం పేర్కొంటుంది. రూపాయి నోట్లను విడుదల చేసే సమయంలో వాటి వివరాలతో కూడిన నివేదికను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. దీనితో పాటు రాబోయే సంవత్సరం చెలామణీ కావాల్సిన నోట్లను ముద్రించి ముందుగానే విడుదల చేయకూడదు.

అయితే , 2018వ సంవత్సరంతో ముద్రించిన రూ.500 నోట్లు ప్రస్తుతం చెలామణీలోకి వచ్చాయి. ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ చెన్నై శాఖ అధికారిని సంప్రదించగా, ఇలాంటి ఆరోపణలు మా దృష్టికి రాలేదు, వస్తే తగు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం 2016 జరుగుతున్న నేపథ్యంలో 2018వ సంవత్సరంతో ముద్రించిన నోట్లు ఎలా వచ్చాయని ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇది నకిలీ నోట్లు అయివుండొచ్చు అనే అనుమానాలను కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి నకిలీ నోట్లో లేదా రిజర్వ్ బ్యాంక్ ముద్రించినవో తెలియచేయాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి గందరగోళం నెలకొంది.

English summary

500 fake notes or real notes