'జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

500 old cars in Janatha Garage shed

10:04 AM ON 31st March, 2016 By Mirchi Vilas

500 old cars in Janatha Garage shed

అవునా, ఎందుకబ్బా, అనుకుంటున్నారా? కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో మళయాళ నటుడు మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీస్ పతాకం పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం సారధి స్టూడియో లో ఓ భారీ సెట్ ను భారీ ఖర్చుతో వేసారు. ఇందులో ఏకంగా 500 కార్లు తెచ్చి పెట్టారట. కానీ ఇన్ని కార్లూ పాతవే. ఎక్కడివి అంటే, హైదరాబాద్ లోని పలు మెకానిక్ షెడ్స్ లో ఉన్న కార్లను సేకరించి ఇక్కడ పెట్టారట. మరి ఆయా షెడ్స్ బోసిబోతున్నాయట.

ఇది కూడా చదవండి: వ్యభిచారిగా మారిన టీచర్

ఇక ఐఐటి లో సాధించిన పతకాలను కూడా ఈ సెట్ లో పెట్టారట. అవి ఎవరవంటే, ఇందులో స్టూడెంట్ గెటప్ కూడా ఎన్టీఆర్ వేస్తున్నాడు కదా, అతను విద్యార్ధిగా సాధించిన పతకాలన్న మాట అవి. ఈ సెట్ లో ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీ దిగారు. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

ఇది కూడా చదవండి: టెన్నీస్‌ బంతులతో వేడి పుట్టిస్తున్న మోడల్‌(వీడియో)

English summary

500 old cars in Janatha Garage shed. Ntr upcoming movies is Janatha Garage, in that movie 500 old cars is using for shed.