చైనాలో అడుపెట్టిన 500పిక్సెల్స్

500 pixel launches in China

03:25 PM ON 14th November, 2015 By Mirchi Vilas

500 pixel launches in China

ఫోటో షేరింగ్ ప్లాట్ఫాంలో అందరికీ సుపరిచితమైన 500పిక్సెల్స్ వెబ్సైట్ ఇప్పుడు చైనాలో కూడా తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 500పిక్సెల్స్ ద్వారా లక్షలాది యూజర్లు తమ తమ ఫొటోలను షేరింగ్ చేసుకోవడమే కాకుండా, అమ్ముకోవడానికి కూడా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. టరంటో నుండి నడపబడుతున్న ఈ సంస్థ ఇప్పుడు చైనాలో కూడా తన సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఈ వెబ్సైట్కు 6మిలియన్ యూజర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు, ఫొటోజర్నలిస్టులు తమ ఫొటోలను ఈ వెబ్సైట్లో ప్రదర్శించుకోవడం కానీ అమ్ముకునే సౌకర్యాన్ని ఈ వెబ్సైట్ కల్పిస్తుంది. చైనాకు చెందిన విజువల్ చైనా గ్రూప్ సంయుక్త భాగస్వామ్యంతో 500పిక్సెల్స్ చైనాలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉన్న చైనాలో అడుగుపెట్టడంతో ఆసియా ఖండానికి తమ సేవలను విస్తరించాలని సంస్థ భావిస్తోంది.

English summary

500 pixel launches in China