అద్భుతం: గుడి కోనేటిలో చెత్త తీస్తుంటే బయటపడ్డ 500ఏళ్ళ క్రితం దేవుడి విగ్రహాలు!

500 years before God idols found at Mannar temple

05:16 PM ON 15th September, 2016 By Mirchi Vilas

500 years before God idols found at Mannar temple

నిజంగా ఇదో అద్భుతం! గుడి కొలనులో పూడిక తొలగిస్తుంటే దేవుడి విగ్రహాలు బయటపడ్డాయి.. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లా మన్నార్ గుడి సమీపంలోని పురాతన ఆలయ కొలనులో ఆరు విగ్రహాలు బయటపడ్డాయి. ఉక్కాడు తెనదురై గ్రామంలోని పురాతన ఆలయం ఉంది. దీని సమీపంలో ఆలయానికి సొంతమైన కోనేరు ఉంది. ఈ కోనేరులో గుర్రపు డెక్క, వ్యర్థాలు చేరుకోవడంతో కొలనును మరమ్మతులు చేపట్టాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం ఎక్స్ కవేటర్ తో చెత్త తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో ఎక్స్ కవేటర్ కు ఏదో తగిలి శబ్ధం విన్న డ్రైవర్ ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు తెలియజేశాడు.

నిర్వాహకులు ఆ స్థలంలో తవ్వకాలు చేపట్టగా రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, ఆళ్వార్, కృష్ణుడి విగ్రహాలు లభించాయి. చిన్న సైజు విల్లు, అంబులు కూడా లభించాయి. ఈ విగ్రహాలు 2 నుంచి 4 అడుగుల ఎత్తుతో, 20 నుంచి 50 కిలోల బరువున్నాయి. ఈ విషయమై గ్రామ నిర్వాహణ అధికారి అందించిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాలు ఇక్కడికి ఎలా వచ్చి ఉంటాయోనని వారు తెలుసుకునేందకు ప్రయత్నించారు. ఇవి సుమారు 500 ఎళ్ల క్రితానికి చెందినవని వారు గుర్తించారు. రాజుల కాలంలో జరుగుతున్న యుద్ధంలో వీటిని కోనేటిలో భద్రపరిచింటారని వారు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్లతో ఏం మాట్లాడుతున్నారో ఈ సీక్రెట్ యాప్ ద్వారా తెలుసుకోండి

ఇది కూడా చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి సొంత వదిననే రేప్ చేశాడు.. ఆపై..

ఇది కూడా చదవండి: నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు.. చంపేస్తారేమో?

English summary

500 years before God idols found at Mannar temple. Officers found 500 years before God idols while repairing koneru at Mannar temple.