కేసీఆర్ ఎక్కౌంట్ లో రూ 5వేల కోట్లా!!

5000 Crores in KCR Account

04:02 PM ON 8th March, 2016 By Mirchi Vilas

5000 Crores in KCR Account

గతంలో ఒకటో రెండో కోట్లు వుంటే, గొప్ప . కానీ ఇప్పుడు ముఖ్య‌మంత్రి, మంత్రుల ఖాతాల్లో కోట్లకు కోట్లు రాబోతున్నాయి. ఇదో వినూత్న స్కీం. ఇంతకీ దీనికి స్కెచ్ వేసింది ఎవరో తెలుసా. ఇంకెవరు తెలంగాణాలో రోజు రోజుకు బలపడుతూ దూసుకుపోతున్న సిఎమ్ కెసిఆర్... అవును , అది ఎలాగంటారా.. ఒసారీ చదవండి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భాల్లో `స్కూళ్లు కట్టిస్తామ‌ని, హాస్ప‌ట‌ల్ నిర్మిస్తామ‌ని, కొత్త కొత్త భ‌వంతులు ఏర్పాటు చేస్తామ‌ని వివిధ ర‌కాల హామీలను ఇవ్వడం సహజం. ఇందులో కొన్ని ప్ర‌ణాళిక ప్ర‌కారం, మ‌రికొన్ని అప్ప‌టిక‌ప్పుడు స‌డ‌న్‌గా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. అయితే ఇచ్చిన హామీలు ఎలాంటివైనా, వాటికి నిధులు కేటాయించేస‌మ‌యంలో మాత్రం కొంత ఇబ్బంది వస్తూ వుంటుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ వినూత్న ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర‌ నుంచి పాల‌న‌తో త‌న‌ మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్న కేసీఆర్‌.. దూరదృష్టితో పాటు.. ఏ ప‌నిని ఎలా చేయాలన్న విషయంలో ప‌క్కాగా ప్లానింగ్‌తో వెళుతున్నారు. తాజాగా నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో చేసిన నిర్ణయాలలో ఓ నిర్ణయం మాత్రం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. తెలంగాణలో సీఎం, మంత్రుల పేరిట ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు అందులో భారీగా నిధులు కేటాయించనున్నారు. ఎంత అంటే.. సీఎం అకౌంట్లో ఏటా రూ.5వేల కోట్లు.. మంత్రుల ఖాతాలో రూ.25 కోట్ల చొప్పున నిధులు ఉంటాయి. జిల్లాలు పర్యటించే సందర్భంగా సమయానికి తగ్గట్లు ఏదైనా అంశం పై స్పందించాల్సి వస్తే.. నిస్పందేహంగా ప్ర‌క‌టించేయ‌చ్చ‌ట‌.

సీఎం , మంత్రులకు సంబంధించి తమ ఖాతాల్లో డబ్బులుభారీగా ఉంటాయి కాబట్టి.. హామీల అమలు విషయంలో లెక్క తేడా వచ్చే అవకాశం ఉండదు. అయితే ఇది విమ‌ర్శ‌ల‌కూ దారితీస్తోంది. ఒక్క సీఎం చేతిలోనే ఐదువేల కోట్లు నిధులు ఉంటే.. ఇక ఎమ్మెల్యేలంతా ఆయన పై ఆధారపడి వివిధ కార్యక్రమాలను తయారు చేసుకోవలసి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒక్క వ్యక్తి చేతిలో ఐదు వేల కోట్లా అన్నది చర్చనీయాంశమే. ఏది ఏమ‌యినా కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయంతో, ముఖ్యమంత్రి మరింత పవర్ ఫుల్ గా మారితే.. మంత్రులు కూడా అదే రీతిలో మరింత పవర్ ఫుల్ గా తయారు కావటం ఖాయ‌మంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు డ‌మ్మీలుగా మార‌తార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎంఎల్ఎ ల అసంతృప్తి కి గురికాకుండా వారి ఖాతాల్లో కూడా ఓ రేంజ్ లో జమ అవుతాయేమో !!

English summary

Telangana TRS Government has decided to work on a new pattern that for every year Telangana Chief Minister Account to be credited with 5000 crore rupees and each 25 crores each to Ministers. This decision to become controversial in Telangana.