హవ్వ! ఆ నేరం చేసినోడికి 50 గుంజీలతో శిక్ష సరిపెట్టేశారట!

51 sit ups punishment for rape in Bihar

11:42 AM ON 8th August, 2016 By Mirchi Vilas

51 sit ups punishment for rape in Bihar

ప్రపంచవ్యాప్తంగా ఎదో ఓ రకంగా మహిళలపై దారుణాలు జరుగుతూనే వున్నాయి. మగాళ్లు మృగాలుగా మారి సాగిస్తున్న పైశాచిక దాడులకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మనదేశంలో కూడా చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాలకు పాల్పడుతున్నవారికి శిక్షలు పడుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఆ శిక్షలు కూడా చాలా మామూలుగా ఉంటున్నాయి. మా వాడికి ఏం తెలీదు కుర్రాడండి అంటూ వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు, ప్రబుద్ధులు ఉండనే వున్నారు. తాజాగా బీహార్ లో ఒక దళిత బాలికపై అత్యాచారం చేసిన యువకుడికి వేసిన శిక్ష చూసి ప్రపంచం నివ్వెరపోయింది. బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడితో కేవలం గుంజీలు తీయించి వదిలేశారట.

బీహార్ లోని గయ జిల్లాలోని బసెతా గ్రామంలో దళిత బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన యువకుడికి గ్రామ పంచాయతీ 51 గుంజీలు తీయాలని శిక్ష వేసి రూ. 1000 జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది. ఆ గ్రామంలో ఏడో తరగతి బాలిక, పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా, అశోక్ అనే ఓ యువకుడు అటకాయించి బలవంతం చేశాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెధిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న యువకుడు ఆరు నెలల పాటు వీలు చిక్కినప్పుడల్లా తన దుర్మార్గాన్ని కొనసాగిస్తూ, దర్జాగా తిరిగేస్తున్నాడు. ఇక అసలు సంగతి బయటకు వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో, బాలిక కుటుంబ సభ్యులు యువకుడిని నిలదీశారు. అబార్షన్ చేయించుకుని వస్తే, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

అయితే అతగాడి మాటలు మాయ మాటలు అని తెలీక, నిజంగానే తమ బిడ్డ గర్భాన్ని తొలగించి తీసుకువచ్చారు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని కోరితే అశోక్ కుటుంబ సభ్యులు గొడవకు దిగి తమ బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదని వాదించారు. దీంతో స్థానిక పంచాయతీని బాధితురాలి కుటుంబం ఆశ్రయించగా పెద్దలు విచారణ జరిపారు. యువకుడు మోసం చేశాడని తేలుస్తూ - 51 గుంజీలు తీయాలని - రూ. 1000 జరిమానా కట్టాలని చెప్పి తీర్పిచ్చారు. ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నింధితుడికి.. స్కూళ్లో హోం వర్కు చేయకపోతే వేసినట్లుగా గుంజీల శిక్ష వేయడంపై అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి పంచాయతీ పెద్దలపై పోలీసులు కేసు పెట్టారు. అయినా ఏం చూసుకుని కామాంధులు ఇలా పేట్రేగిపోతున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

English summary

51 sit ups punishment for rape in Bihar