షాకింగ్: 53% పిల్లలు ఆ సైట్లే చూస్తున్నారట.. సర్వేలో బయటపడ్డ నిజాలు!

53% children is watching bad sites

11:47 AM ON 21st November, 2016 By Mirchi Vilas

53% children is watching bad sites

టెక్నాలజీ వలన ఎంతగా ఉపయోగం ఉందో అంతేరీతిలో నష్టం వుంది. సెల్ ఫోన్లు ఇబ్బడిముబ్బడిగా రావడం, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పూర్తిగా అందుబాటులోకి రావడంతో కొన్ని మంచి పనులు జరుగుతున్నా, మరికొన్ని ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా పిల్లల జీవితాలను పోర్న్ సైట్లు పాడు చేస్తున్నాయని ఇంగ్లండ్ కల్చర్ సెక్రటరీ కరేన్ బ్రాడ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలల దాతృత్వ సంస్థ ఎన్ఎస్పీసీసీ, ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమిషనర్ నిర్వహించిన అధ్యయనంలో దారుణమైన వాస్తవాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. పిల్లల వయసు నిర్ధారణ నిబంధనలను కఠినంగా అమలు చేయని ఇటువంటి వెబ్ సైట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

సరైన వయసు నిర్ధారణ తనిఖీల కోసం ఓ రెగ్యులేటర్ ను నియమించినట్లు తెలిపారు. ఈ నిబంధనలను పాటించని సైట్లపై ప్రభుత్వం నిషేధం విధిస్తుందన్నారు. 11-16 సంవత్సరాల మధ్య వయస్కుల్లో 53 శాతం మంది అశ్లీలతను ఆన్ లైన్ ద్వారా చూస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. బాల్యంలోనే అసభ్యకరమైన అశ్లీలతను చూడటం వల్ల యావత్తు తరం తమ బాల్యాన్ని కోల్పోతుందని పేర్కొంది.

English summary

53% children is watching bad sites