57 మంది బడాబాబులు.. బ్యాంకుకి ఎగ్గొట్టిన సొమ్మెంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

57 borrowers owe 85000 crores

11:49 AM ON 26th October, 2016 By Mirchi Vilas

57 borrowers owe 85000 crores

బంకుల జాతీయకరణ తర్వాత కొత్తలో ఏవో కొన్ని లోన్లు మినహా సామాన్యులు లోన్లు కోసం బ్యాంకు మెట్లు ఎక్కితే పనయ్యే పరిస్థితి దాదాపు తగ్గిపోయింది. ఇక బడా బాబులకు వద్దంటే లోన్లు ఇచ్చేస్తారు. పొరపాటున ఓ సామాన్యుడు మాకు లోన్ ఇవ్వండి మహాప్రభో అంటూ కాళ్లు అరిగేలా బ్యాంకులు చుట్టూ తిరిగినా సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కోవాలి. మరెన్నో ష్యూరిటీలు. అప్పుడుగానీ లోన్ ఓకేకాదు. కానీ కొంతమంది బడాబాబులు ఇలా వెళ్తే అలా బ్యాంకులు కోట్లకు కోట్లు రుణాలు ఇచ్చేస్తారు. అందుకు ఎగ్జాంఫుల్ ఈ ఐటెమ్.

1/4 Pages

57 మంది బడాబాబులు రూ.85,000 కోట్ల మేరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఎగ్గొట్టేశారు. వీళ్ల జాబితాని అత్యున్నత న్యాయస్థానానికి ఆర్బీఐ అందజేసింది. మరి అందులోని ఆ వ్యక్తులెవరో తెలియాలంటే 28 వరకు ఆగాల్సిందే! బ్యాంకుల కోట్లలో రుణాలను ఎగవేతదార్ల పేర్లు వెల్లడించాలంటూ స్వచ్ఛంద సంస్థ ఓ పిటిషన్ వేసింది. పిటీషనర్ ఎంత బకాయిలు బ్యాంకులకు వసూలు కావాల్సివుందో వెల్లడించాలని తరపు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సూచించారు.

English summary

57 borrowers owe 85000 crores