ఆమె కడుపులో 'కత్తి' పండింది

6 inch Knife In Woman Stomach

10:29 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

6 inch Knife In Woman Stomach

ఆమధ్య ఆపరేషన్ సమయంలో కత్తెరలు వదిలేసి కుట్లు వేశారని పెద్ద రాద్ధాంతం అయింది. అయితే తాజాగా ఓ మహిళ కడుపులో కత్తి ప్రత్యక్షం అయింది. అయితే ఇది డాక్టర్ మతిమరుపు నిర్వాకం కాదు. అలాగని కత్తిలాంటోడు కడుపున పడలేదు. మరి ఆత్మహత్యాయత్నంలో భాగంగా ఆమె కత్తి మింగిందా అనేది చెప్పడంలేదు. మొత్తానికి ఏం జరిగిందో ఏమోకాని ఆ మహిళ కడుపులో కత్తి ఉన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. కడుపునొప్పితో బాధపడుతున్న మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ కు చెందిన స్వప్న గాంధీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. ఎక్సరేలో పదునైన ఆరంగుళాల కత్తి గొంతులో నుంచి కడుపులోకి చేరినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. గొంతు, అన్నవాహిక.. ఇలా కడుపులోకి చేరిన పదునైన కత్తివల్ల బాధితురాలికి ఇంతకాలం ఎక్కడా ఎలాంటి గాయం కాలేదు. ఇదో ఆశ్చర్యమైతే, అసలు ఆ మహిళ కడుపులోకి కత్తి ఎలా వెళ్లిందనేది మిస్టరీ అయికూర్చుంది.

దీనికి సదరు మహిళ నుంచి పొంతనలేని సమాధానాలు వస్తుండటంతో బాధితురాలి మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి స్వప్న కడుపులోంచి కత్తిని బయటకు తీశారు. అంతకుముందు సహజసిద్ధంగా కడుపులోంచి కత్తి బయటకు వచ్చేలా ప్రయత్నించి అందుకు అనువైన ఆహారం అందించినా కత్తి కడుపులో అడ్డం తిరగడంతో తప్పనిపరిస్థితుల్లో గాంధీ ఆస్పత్రి సర్జన్లు, ఎనస్తీషియా వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్..ఒక బృందంగా ఏర్పడి సర్జరీని సక్సెస్ చేశారు. కడుపులో కత్తి కధ మాత్రం తేలకపోవడంతో ఈ మిస్టరీ అలాగే ఉంది.

ఇవి కూడా చదవండి:హీరో డాటర్ కి మత్తుమందిచ్చి.. నరకం చూపిన తల్లి

ఇవి కూడా చదవండి:బీరు అమ్మకాల్లో తెలంగాణా దుమ్ము రేపింది(వీడియో)

English summary

A 6-inch knife was removed from a woman stomach in Narayankhed in Medak District in Telangana State. Doctors did operation and they removed knife from the woman stomach.