ఆరు అంగుళాల అస్థిపంజరం.. ఇది ఎవరిదో తెలుసా

6 Inches Skeleton...Do you Know whose this?

11:13 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

6 Inches Skeleton...Do you Know whose this?

బాగా పొడుగ్గా ఉంటే,ఆరడుగుల ఆజానుబాహుడు అంటాం. బాగా కురుచగా ఉంటే మరుగుజ్జు అంటాం. అయితే కేవలం ఆరు అంగుళాల మానవ అస్థిపంజరం వెలుగుచూసింది. దీంతో ఈ ఘటన శాస్త్రవేత్తలను షాక్ కు గురిచేస్తోంది. చీలీలోని అటకామా ఎడారిలో 2013లో ఈ అస్థిపంజరం ఆస్కార్ మునోజ్ అనే వ్యక్తికి దొరికింది. దీనిని అతడు స్పెయిన్ వ్యాపార వేత్త రమన్ నవియా ఓసొరియేకు అమ్మాడు. ప్రస్తుతం ఇతడి వద్దే ఈ అస్థిపంజరం ఉంది. ఈ అస్థిపంజరం మానవ అస్థిపంజరం మాదిరే ఉంది. అయితే, పుర్రె కొత్త భిన్నంగా ఉండడంతో ఇది గ్రహాంతర వాసులదై ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇది మానవ అస్థిపంజరమే అని డీఎన్ ఏ పరీక్షలో తేలింది. అయితే.. నెలలు నిండకుండా పుట్టిన శిశువుదని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కానీ, చాలా మంది.. ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసులదే అని, మానవుల పుర్రెకు పూర్తి భిన్నంగా, వింతగా ఉన్న దీని పుర్రెనే అందుకుసాక్ష్యం అని అంటున్నారు. మరోవైపు ఈ అటకామా అని పిలుస్తున్న ఈ అస్థిపంజరం పుర్రె శాస్త్రవేత్తలను తలలు పట్టుకునేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అస్థిపంజరంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చూడండి : ముఖం మీద రంద్రాలను తొలగించటానికి చిట్కాలు

ఇది కూడా చూడండి : బియ్యం కడిగిన నీటిని ఇలా కూడా వాడొచ్చా..

ఇది కూడా చూడండి : ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్

English summary

6 Inches Skeleton was found in Chile in Atacama desert some people were saying this as Skeleton Of Alliens.