6,800 కోట్లు.. ఇది ఆస్తి కాదు పెళ్లి ఖర్చు!

6 thousand 800 crores marriage in Russia

03:14 PM ON 31st March, 2016 By Mirchi Vilas

6 thousand 800 crores marriage in Russia

పెళ్ళంటే… పందిళ్ళు... తప్పెట్లు… తాళాలు…  ఏడే ఆడుగులు… మూడే ముళ్లు… అంటూ ఓ సినీ కవి ఆ మధ్య వర్ణిస్తే, అదేం కాదు, పెళ్ళంటే అక్షరాలా 6,800 కోట్ల రూపాయల ఖర్చని ఓ ఘనుడు నిరూపించాడు. ఇదేమిటని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే, కజకిస్థాన్ లో పుట్టి రష్యా చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిఖాయిల్ గుత్సరీవ్ తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివాహ వేడుకను మాస్కోలోని లగ్జరీ హోటల్ లోని సఫియా బాంక్వెట్ హాల్ లో ఏర్పాటు చేసి, పూలతో తీర్చిదిద్దిన భారీ వేదిక పై, ఇలలో ఎవరూ చేయలేదు, ఆ తరువాత కూడా ఎవరూ చేయలేరు అన్నట్టుగా అంగ రంగ వైభవంగా 28 ఏళ్ళ సయీద్ గుత్సరీవ్ 20 ఏళ్ళ ఖదీజా ఉజకోవ్ ను వివాహం చేసుకున్నాడు.

వివాహ వేదికను పూలవనంలా తీర్చి దిద్దారు. ఇక ఈ వివాహానికి ఏకంగా 6,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. వధువు ధరించిన ఫ్రెంచ్ డిజైనర్ గౌనుకే దాదాపు 16.20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని అంటున్నారు. ఆహూతులను అలరించేందుకు జెన్నిఫర్ లోపెజ్, హెన్రిక్ ఇంగ్లేషియస్ వంటి అంతర్జాతీయ పాప్ స్టార్స్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిఖాయిల్ గుత్సరీవ్ కు మొత్తం 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు చెప్పుకుంటున్నారు.

1/3 Pages

English summary

6 thousand 800 crores marriage in Russia.