60 నిముషాల గ్రాఫిక్స్‌తో రుద్రాక్ష

60 minutes graphics in Rudraksha movie

11:59 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

60 minutes graphics in Rudraksha movie

'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తరువాత దాదాపు రెండు సంవత్సరాల తరువాత కృష్ణవంశీ ఒక హర్రర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. 'రుద్రాక్ష' టైటిల్‌తో తెరకెక్కునున్న ఈ చిత్రంలో ఏకంగా 5 మంది హీరోయిన్లు, 5 మంది హీరోలు నటించనున్నారు. అయితే ఇదొక లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం కావడంతో మెయిన్‌ హీరోయిన్‌గా అనుష్కను, విలన్‌ పాత్రకి సెక్సీ భామని సమంతాని ఎంపిక చేసుకున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో ప్రధాన పాత్రకి కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణను కూడా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించనున్నాడు. కృష్ణవంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నాడు.

అందుకే ఇందులో భారీ ఎత్తున గ్రాఫిక్స్‌తో దాదాపు గంట పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడు. అందుకే దేశంలో అత్యంత ప్రముఖ విఎఫ్‌ఎక్స్‌ సంస్థలతో కృష్ణవంశీ చర్చలు జరుపుతున్నాడు. ఎవరైతే బాగా చేయగలరని అనిపిస్తుందో కృష్ణవంశీ వాళ్లని సెలెక్ట్‌ చేసుకుంటాడట. అత్యంత వ్యయంతో ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడట.

English summary

Krishna Vamsi latest movie Rudraksha movie has 60 minutes graphics. In this movie 5 heroes and 5 heroines was acting in lead roles. Anushka is acting as a main heroine and Samantha is acting in negative role.