ఆ ఒక్క బ్యాంకులో ఎన్ని కోట్లు డిపాజిట్ అయ్యాయో తెలుసా?

60 thousand crores were deposited in State Bank of India

11:14 AM ON 12th November, 2016 By Mirchi Vilas

60 thousand crores were deposited in State Bank of India

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా నగదు జమ అవుతోంది. ఒక్క ప్రభుత్వ బ్యాంకులోనే సుమారు రూ. 60,000 కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. రద్దైన రూ.500, రూ.1000 నోట్లను కొత్త వాటితో మార్చుకోవడంతో పాటు ఖాతాల్లో జమ చేసేందుకు జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తొలి రోజైన గురువారం రూ.31,000 కోట్ల నగదు జమ అయ్యింది. రెండో రోజైన శుక్రవారం మధ్యాహ్నానికి మరో రూ.22,000 కోట్ల డబ్బులు డిపాజిట్ అయ్యాయి. దీంతో రెండు రోజుల్లో సుమారు అరవై వేల కోట్లకుపైగా పెద్ద నోట్లు జమ అయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య శుక్రవారం వెల్లడించారు.

అలాగే రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో సుమారు రూ.1500 కోట్ల నగదును రద్దైన పెద్ద నోట్లకు మార్పిడి చేసినట్లు ఆమె వివరించారు. ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకులోనే రెండు రోజుల్లో సుమారు అర కోటి కోట్లకుపైగా పెద్ద నోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇక అన్ని బ్యాంకులను కలుపుకుంటే ఎంత మొత్తంలో పెద్ద నోట్లు జమ అయ్యి ఉంటాయో అన్నది ప్రస్తుతానికి లెక్కతోపాటు ఊహకందని విషయం.

English summary

60 thousand crores were deposited in State Bank of India