అతగాడికి బొమ్మే గాళ్ ఫ్రెండ్... అన్నీ దాంతోనే...

61 years old man falls in Love with Doll

06:05 PM ON 28th June, 2016 By Mirchi Vilas

61 years old man falls in Love with Doll

అవునా అంటే అవునని మనకు రుజువు చేస్తోంది ఈ ఘటన. నిజం అతనికి పెళ్ళాం పిల్లలున్నా అతను గడిపేది బొమ్మతోనే. అంతగా ఆ బొమ్మను ప్రేమించాడు. ఈ బొమ్మకు సవోరి అని పేరు పెట్టాడు. సెంజీ ది ఓ డిఫరెంట్ లవ్ స్టోరి మరి... అందుకే అందరినీ వావ్ అనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇతడి వయస్సు 61 ఏళ్లు. ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నగానోలో కాపురముండే ఇతడు అనుకోకుండా సిలికాన్ బొమ్మ వెంటపడ్డాడు. అంతే కాదు ఆ బొమ్మను గర్ల్ ఫ్రెండ్ గా భావించి, ఏకంగా రూ 3.5 లక్షలు పెట్టి ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే ఇతనికి పెళ్లాం లేదా అంటే.. పెళ్లాంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నా సరే, పెళ్లాం కంటే ఎక్కువగా బొమ్మను ప్రేమించాడు.

బహుశా పెళ్లానికి కూడా ఇలా సేవలు చేసి ఉండడేమో!.. పొద్దున నిద్రలేచాక మొదలుకుని ఆమె(బొమ్మ) సేవలో తరించిపోతున్నాడు. ఆఖరికి పడుకునే ముందు కూడా ప్రాణంలేని ప్రేయసి(బొమ్మ)ని పక్కనే పడుకోబెట్టుకుంటున్నాడు. షాపింగ్, బోటింగ్, రెస్టారెంట్ కు తీసుకెళ్లడం, రెండురోజులకోసారి హెయిర్ మార్చడం, కారులో ప్రయాణించేటపుడు పక్కనే కూర్చోబెట్టుకోవడం, వీల్ చైర్ లో తోసుకుంటూ రోడ్ల మీద విహరించడం.. ఇలా తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు. అంతటితో వదల్లేదు, ఆఖరికి స్నానం కూడా చేయిస్తున్నాడట. రోజుకో రంగు దుస్తులతో బొమ్మను అలరిస్తూ ముద్దు ముద్దుగా చూసుకుంటాడట.

ఇంతగా బొమ్మపై అతగాడు అంతగా ప్రేమ ఎందుకు పెంచుకోవడానికి కారణం ఉంది.. మనుషులపై విసుగుపుట్టిన ఆయన ఇలా డైలాగులు పేలుస్తున్నాడు... ఈ బొమ్మ చాలా మంచిది. అసలు ఇది బొమ్మ అనుకుంటే మీ అమాయకత్వమే. ఇది నా లవర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మనుషులు హృదయం లేని వారు.. మోసం చేయాలని చూస్తారు.. కానీ సవోరీకి డబ్బుపై ఆశ లేదు.. నిర్మల హృదయం ఉంది అంటూ సినిమాల్లో కంటే పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నాడు. ఈ మాటలు విన్న జనాలు మాత్రం ఇతనికి పిచ్చి పట్టిందేమో.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు.. పెళ్లాం కంటే బొమ్మే ఎక్కువైంది..

ఆఖరికి పిల్లలను కూడా పట్టించుకోకుండా సర్వస్వం నాకు బొమ్మే అంటున్నాడు అని గొణుకుంటున్నారు. మొత్తానికి ఒక్కక్కరిదీ ఒక్కోరకం కదా.

ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడండి:

1/15 Pages

English summary

61 years old man falls in Love with Doll