తిరుమల ఘాట్‌ రోడ్లు వేసి ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా?

62 years for Mokshagundam Visvesvaraya Tirumala ghat road

10:35 AM ON 19th April, 2016 By Mirchi Vilas

62 years for Mokshagundam Visvesvaraya Tirumala ghat road

తిరుమల ఘాట్‌ రోడ్డు. ఎంత పేరుందో.. అంత ప్రమాదకరమైన మలుపులు, ఆదమరిస్తే పెనుప్రమాదం పొంచి వుంటుంది. ఎందుకంటే వందల అడుగుల ఎత్తు, ఇంతటి ఘన చరిత్ర గల తిరుమల ఘాట్‌ రోడ్డు గురించి చెప్పుకుంటే తరగదు. తిరుమలకు రెండు ఘాట్‌ రోడ్డులుగా ఉన్నాయి. ఇందులో ఒక ఘాట్‌ రోడ్డు తిరుమలకు వెళ్లడానికి, మరో ఘాట్‌ రోడ్డు తిరుమల నుంచి కిందికి రావడానికి వినియోగిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్‌ రోడ్డులో వెళ్ళాలంటే కనీసం 30 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే తిరుమల నుంచి తిరుపతికి రావాలంటే 45 నిమిషాల సమయం తీసుకుంటుంది.

శేషాచలం అడవుల్లో నుంచి వేసిన తిరుమల ఘాట్‌ రోడ్లంటే సాదా సీదా రోడ్లు కావు. ఎన్నో మలుపులు వుంటాయి. 1944వ సంవత్సరం ఏప్రిల్‌ 10లో నాటి ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో ఈ ఘాట్‌ రోడ్డు వేశారు. మొదటగా ఘాట్‌ రోడ్డును అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్తూర్‌ హోప్‌ ప్రారంభించారు. మొదట్లో ఘాట్‌రోడ్డులో చిన్నపాటి బస్సులు వెళ్లేవి. అవి క్రమేపి పెద్దగా మారాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేసిన రోడ్ల పైనే రోడ్లు వాడుతున్నారే గానీ, వేరే రోడ్లు మాత్రం వేయలేదంటే ఆయన ఘాట్‌ రోడ్డు వేయడానికి ఎంత శ్రమపడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అప్పట్లోనే ఘాట్‌ రోడ్డు వేయడానికి సంవత్సరంకు పైగా సమయం పట్టిందంటే ఎంత కష్టమో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ప్రస్తుతం టీటీడి ఇంజనీరింగ్‌ అధికారులు మాత్రం తారు రోడ్డు మీద తారు రోడ్లు వేస్తూనే ఉన్నారు. తిరుమల ఘాట్‌ రోడ్డు వేసి 62 వసంతాలు పూర్తి కావడంతో టీటీడి ఇంజనీరింగ్‌ విభాగం సంబరాలు చేసుకుంటోంది. 1944 సంవత్సరంలో వేసిన రోడ్లు పైనే మరో రోడ్లు వేయడం నిజంగా వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

టీటీడి అధికారులకు మాత్రమే కాదు తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఘాట్‌ రోడ్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను చాలా మంది తలచుకుంటూనే వుంటారు. ఆయనకు ఘన నివాళి.

English summary

62 years for Mokshagundam Visvesvaraya Tirumala ghat road. Till now 62 years completed for Mokshagundam Visvesvaraya Tirumala Ghat road. The road was builted on 1944 April 10th.