ఈ బామ్మ అమ్మయింది ... అరుదైన రికార్డు

63 Years Old Woman Gives Birth To Baby In Melbourne

12:46 PM ON 4th August, 2016 By Mirchi Vilas

63 Years Old Woman Gives Birth To Baby In Melbourne

రకరకాల వ్యాధులకు మందులు వస్తున్నా , ఇంకా వివిధ రకాల వ్యాధులు వస్తున్న నేపథ్యంలో మనిషి సగటు జీవితం పెద్దగా పెరగడం లేదు. మహా అయితే 60 ఏళ్ళు బతికితే చాలా గొప్ప అంటున్నారు. అలాంటిది అరవై దాటాకా, అందునా పిల్లల్ని కనడం మరీ విడ్డూరం కదా. కానీ జీవిత చరమాంకంలో ఓ మహిళ ఈ అరుదైన రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన 63 ఏళ్ళ బామ్మ ఆగస్ట్ 1న మెల్ బోర్న్ ఆసుపత్రిలో ఆడ పిల్లకు జన్మనిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, సంతానం కోసం ఏళ్ళగా పరితపించిన ఆమె ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విదేశీ దాత నుంచి స్వీకరించిన పిండంతో ఆ లోటు తీర్చుకుంది. లేటు వయసులో పిలల్ని కన్న రెండో వృద్ధ మహిళగా ఈమె ఘనత సాధించింది. 78 ఏళ్ళ ఆమె భర్త, ఆమె తమ బిడ్డను చూసి మురిసిపోతున్నారు.

2010లో 60 ఏళ్ళ వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ఆస్ట్రేలియా మహిళ రికార్డును ఈమె బ్రేక్ చేసింది. అయితే రొమేనియాకు చెందిన అడ్రియానా 2005లో 66 ఏళ్ళ వయసులో ఆడ పిల్లకు జన్మనిచ్చిన తొలి మహిళగా ప్రపంచ రికార్డుకెక్కింది. ఇక వయస్సు మళ్ళిన వారికి ఐవీఎఫ్ చికిత్సలందిస్తున్న వైద్యులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 53 ఏళ్ళు దాటిన మహిళలకు ఇలాంటివి ప్రోత్సహించడం వైద్యపరంగా విరుద్ధమని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఓ రికార్డుగా నమోదైంది.

ఇది కూడా చూడండి: ఛ.ఛ. రేప్ వీడియో క్లిప్ లు చౌకగా అమ్మేస్తున్నారట!

ఇది కూడా చూడండి: భారీ జరిమానాలతో యాక్సిడెంట్లకు చెక్!

ఇది కూడా చూడండి: ఆనాడు ఏపీకి మట్టి ... నేడు తెలంగాణకు చెంబు .. ..

English summary

63 Years Old Woman Gives Birth To Baby In Melbourne.