ఒళ్ళంతా టాటూలు - గిన్నీస్ రికార్డు సాధించిన బామ్మ

67 Year old Woman Creates World Record By Her Tattoos

11:44 AM ON 12th September, 2016 By Mirchi Vilas

67 Year old Woman Creates World Record By Her Tattoos

ఇదో విచిత్రం .. ఓ వృద్ధ మహిళ అని తీసి పారేయొద్దు ... రికార్డు బద్దలు కొట్టడానికి , రికార్డు సృషించడానికి నేను సైతం అంటూ ఈ 67 ఏళ్ళ బామ్మ తల భాగం నుంచి కాలి వేళ్ల వరకూ రంగురంగుల టాటూలు వేయించుకొంది. దీంతో ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేసింది. 67 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, ఇప్పటికే ఆమె భర్త కూడా గతంలో టాటూలతో గిన్నిస్ రికార్డు సృష్టించడం విశేషం.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన చార్లెట్ గుటెన్ బర్గ్ రచయిత. ఈమె తన శరీరంలో 91.5 శాతం వివిధ రకాల డిజైన్లు, రంగులతో అందమైన టాటూలు వేయించుకుంది. టాటూలు అంటే అమితంగా ఇష్టపడే ఈ మహిళ 2006 నుంచి తన శరీరంపై టాటూలు వేయించుకోవడం ప్రారంభించింది. ఇలా దాదాపు శరీరమంతా టాటూలు వేయించుకుంది. మొత్తానికి గిన్నీసు రికార్డు కొట్టేసింది. ఇక ఆమె భర్త చార్లెస్ హెల్మ్ కే కూడా టాటూలతో గతంలో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. ఒంటిపై ఎక్కువభాగం టాటూలు వేయించుకున్న వృద్ధుడు ఈయనే కావడం విశేషం. మొత్తానికి అప్పుడు తాతయ్య , ఇప్పుడు బామ్మ ఒకే రకమైన రికార్డులు కొట్టేయడం నిజంగా గ్రేట్.

ఇవి కూడా చదవండి:భయం గొల్పే పండగ ... శవాలు లేచొస్తాయ్ (ఫోటోలు)

ఇవి కూడా చదవండి:ఆ రికార్డు కోసం గెడ్డం పెంచిన భామ

English summary

A 67 year old wonam named Charlet Guten Berg was created a world record by the Tattoos on her body. 91.5 of her body was covered with tattoos. Her husband also created worlds record with his tattoos.